https://oktelugu.com/

Rajasekhar: ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా కోసం రాజశేఖర్ అన్ని కోట్లు తీసుకున్నాడా..?

యితే ఇదే క్రమంలో ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని పోషించిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఈ సినిమాలో తను మొదటిసారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2023 / 03:27 PM IST
    Follow us on

    Rajasekhar: ఇక రీసెంట్ గా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఒకటి…ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే ప్లాప్ టాక్ ను తెచ్చుకోవడం విశేషం… నిజానికి ఈ సినిమాలో కంటెంట్ బాగున్నప్పటికీ డైరెక్టర్ తెరకెక్కించిన విధానం బాగాలేదని చాలామంది డైరెక్టర్ వక్కంతం వంశీ మీద చాలా సీరియస్ అయ్యారు.

    అయితే ఇదే క్రమంలో ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని పోషించిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఈ సినిమాలో తను మొదటిసారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. కానీ ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆయన క్యారెక్టర్ అంత బాగా ఎలివేట్ అవ్వలేదనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయి ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే ఆయన ఇండస్ట్రీలో చాలా బిజీ అయిపోయేవారు…ఇక ఇదిలా ఉంటే రాజశేఖర్ ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యున్ రేషన్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ నితిన్ వాళ్ళ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి కావడం వల్ల ఈ సినిమాకి రాజశేఖర్ ని ఒప్పించి ఆయనకి రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యున్ రేషన్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది…అయితే ఈ సినిమాలో ముందుగా రాజశేఖర్ చేయను అని చెప్పినప్పటికీ టెంప్టింగ్ ఆఫర్ గా రెండు కోట్ల రూపాయలను ఇచ్చి రాజశేఖర్ చేత ఆ క్యారెక్టర్ లో నటింపజేసినట్టుగా తెలుస్తుంది…అయితే ఆ క్యారెక్టర్ లో రాజశేఖర్ తనదైన రీతిలో చాలా మంచి పర్ఫామెన్స్ ని కనబరిచాడు కానీ సినిమా పెద్దగా ఆడకపోవడం తో ఆయన క్యారెక్టర్ ఏలివెట్ అవ్వలేదు…

    ఇక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం పట్ల మొదట్లో కొంతమంది ప్రముఖులు నెగిటివ్ గా మాట్లాడినప్పటికీ ఈ సినిమాలో తన పర్ఫామెన్స్ చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నిజానికి ఆ క్యారెక్టర్ లో డెప్త్ ఉంది. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఆయన క్యారెక్టర్ కి అంత మంచి గుర్తింపు అయితే రాలేదు…మరి రాజశేఖర్ కి ఫ్యూచర్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సినిమాల్లో చేసే అవకాశం వస్తుందో లేదో చూడాలి…