Nagarjuna First Wife Son: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కి మొత్తం రెండు పెళ్లిళ్లు అయ్యాయి అనే విషయం జగమెరిగిన సత్యం. మొదటి భార్య ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె, విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) సోదరి లక్ష్మి(Lakshmi Daggubati) ని పెళ్లాడాడు. అయితే పెళ్ళైన కొన్నేళ్ళకే వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. అప్పటికే ఈ జంటకు నాగ చైతన్య పుట్టి ఉన్నాడు. ఆమెతో విడాకులు జరిగిన తర్వాత నాగార్జున అమల ని ప్రేమించి పెళ్లాడడం, వీళ్లకు అఖిల్ జన్మించడం వంటివి జరిగాయి. ఈ స్టోరీ మొత్తం అందరికీ తెలిసిందే. అయితే లక్ష్మి మళ్ళీ పెళ్లి చేసుకుండా లేదా?, ఒకవేళ చేసుకుంటే ఎవరిని చేసుకుంది?, ఆమెకు నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కాకుండా మరో కొడుకు కూడా ఉన్నాడా వంటి సందేహాలు చాలా మందికి వచ్చి ఉండొచ్చు. నాగార్జున తో విడాకులు జరిగిన తర్వాత లక్ష్మి రెండవ పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమే.
Also Read: వార్ 2 vs కూలీ సినిమాల్లో ఏ మూవీ హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ప్లస్…
ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్ళాడి ఆమె విదేశాల్లోనే స్థిరపడింది. ఈమెకు మరో కొడుకు కూడా ఉన్నాడు. అంటే నాగ చైతన్య తమ్ముడు అన్నమాట. వీళ్ళు నాగ చైతన్య, సమంత పెళ్ళికి వచ్చారు, ఇప్పుడు నాగ చైతన్య, శోభిత పెళ్ళికి కూడా వచ్చారు. నాగ చైతన్య ప్రత్యేకంగా శోభిత తో కలిసి తన అమ్మ లక్ష్మి కుటుంబంతో ఫోటోలు కూడా తీసుకున్నాడు. వాటిని మీరు క్రింద చూడవచ్చు. ఇకపోతే లక్ష్మి కొడుక్కి కూడా వివాహం జరిగిపోయింది. నాగ చైతన్య కంటే ముందే జరిగిపోయింది అనుకోవచ్చు. ఆ సమయం లో నాగచైతన్య వాళ్ళ పెళ్ళికి వెళ్లిన ఫోటోలను కూడా మీరు క్రింద చూడవచ్చు. సినిమాల్లోకి వస్తే ఇతను కూడా మంచి హీరో అయిపోయేవాడేమో, కానీ ఆయన ఐటీ రంగాన్ని ఎంచుకున్నాడు. విదేశాల్లో సొంతంగా ఎన్నో ఐటీ కంపెనీలను కూడా నడుపుతున్నాడట. సంపాదన కోట్లలోనే ఉంటుందట. ఈ విషయాలు అక్కినేని అభిమానులకు కూడా పూర్తి స్థాయిలో తెలియవు.


Nagarjuna First Wife Son