Kinjarapu RamMohan Naidu Baby: కింజరాపు కుటుంబంలోకి( kinjarapu family ) వారసుడు వచ్చాడు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రి అయ్యారు. రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్య పండంటి మగ బిడ్డకు ఈరోజు జన్మనిచ్చారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఆమె ప్రసవించారు. ఇప్పటికే ఆ దంపతులకు తొలి సంతానంగా కుమార్తె ఉంది. రెండో సంతానంగా బాబు పుట్టాడు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారంటూ అభిమానులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. దీంతో ఎర్రం నాయుడు మళ్ళీ పుట్టారంటూ కుటుంబ అభిమానులతో పాటు టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రామ్మోహన్ నాయుడుకు తోటి మంత్రులతో పాటు ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రావ్య మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె. ప్రస్తుతం ఆయన మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు.
Also Read: లోకేష్ తో పాటు రామ్మోహన్ నాయుడు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
హ్యాట్రిక్ విజయం..
రామ్మోహన్ నాయుడు తండ్రి కింజరాపు ఎర్రం నాయుడు( Yaram Naidu ) తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందారు. తండ్రి మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం మోడీ క్యాబినెట్లో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చిన్న వయసులో కేంద్రమంత్రి పదవి పొందిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. 2017లో రామ్మోహన్ నాయుడుకు శ్రావ్యతో వివాహం జరిగింది. తొలి సంతానంగా కుమార్తె ఉన్నారు. ఇప్పుడు రెండో సంతానంగా బాబు పుట్టారు.
Also Read: తలోదారిలో టీడీపీ ఎంపీలు? అసంతృప్తికి కారణాలేంటి?
తండ్రి మరణంతో ఎంట్రీ..
ఎర్రం నాయుడు మరణించే వరకు ఆయనకు ఒక కుమారుడు ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. ఎర్రం నాయుడు మరణం తరువాతనే రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu ) తెరపైకి వచ్చారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలో చదివారు రామ్మోహన్ నాయుడు. నాలుగు, ఐదు తరగతులు మాత్రం హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్లో చదివారు. 1996 నుంచి రామ్మోహన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. అక్కడే ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యువనేతగా రాణిస్తున్నారు. పార్టీతో పాటు కేంద్ర ప్రభుత్వంలో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. కింజరాపు కుటుంబానికి శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు.