Geetu Royal: హోస్ట్ గా నాగార్జున ఫెయిల్, అదంతా స్క్రిప్ట్… షాకింగ్ మేటర్ లీక్ చేసిన గీతూ రాయల్!

తాజాగా బిగ్ బాస్ షో గురించి గీతూ మాట్లాడుతూ .. '' బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై జనానికి చాలా డౌట్స్ ఉంటాయి .. అడగాల్సిన ప్రశ్నలు ఉంటాయి. హోస్ట్ నాగార్జున అడుగుతారనుకుంటే .. ఆయన ఇప్పటి వరకు చేసిన అన్ని సీజన్స్ హోస్టింగ్ చాలా సాగింది.

Written By: NARESH, Updated On : December 27, 2023 1:37 pm

Geetu Royal

Follow us on

Geetu Royal: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ అందరికీ సుపరిచితమే. ఈ బిగ్ బాస్ రివ్యూవర్ ఆ సీజన్ లో మోస్ట్ ఇరిటేడెడ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించింది. ఆమె అతిని భరించలేక 9వ వారమే ప్రేక్షకులు బయటకు పంపేశారు. ఆ తర్వాత సీజన్ 7 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేసి వెలుగులోకి వచ్చింది. కాగా గీతూ రాయల్ ప్రస్తుతం హోస్ట్ నాగార్జున పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

తాజాగా బిగ్ బాస్ షో గురించి గీతూ మాట్లాడుతూ .. ” బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై జనానికి చాలా డౌట్స్ ఉంటాయి .. అడగాల్సిన ప్రశ్నలు ఉంటాయి. హోస్ట్ నాగార్జున అడుగుతారనుకుంటే .. ఆయన ఇప్పటి వరకు చేసిన అన్ని సీజన్స్ హోస్టింగ్ చాలా సాగింది. చాలా నార్మల్ ప్రశ్నలేస్తారు. కంటెస్టెంట్స్ తప్పొప్పులు బయటపెట్టే ప్రశ్నలు, బెండు తీసే ప్రశ్నలు అడగలేదు. హోస్ట్ గా నాగార్జున ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే .. అప్పటి వరకు నాగార్జున గారికి స్క్రిప్ట్ వస్తుందని నాకు తెలియదు. నాగార్జున గారే ఎపిసోడ్ చూసి హోస్ట్ చేస్తారేమో అనుకున్నా. సన్నీ – షణ్ముఖ్ (సీజన్ 5 కంటెస్టెంట్స్) విషయంలో ఇష్యులో సన్నీది తప్పు లేకపోయినా .. సన్నీదే తప్పని అన్నారు. నేను ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. నాకు .. చంటి గారికి మధ్య ఓ ఇష్యూ జరిగింది. దానికి సంబంధించిన వీడియో చూపించి, నాదే తప్పు ఉందని వీడియోను తిప్పి తిప్పి చూపించారు.

నా తప్పు లేకపోయినా .. నాగార్జున గారు మాత్రం నాదే తప్పని ఒప్పించడానికి ట్రై చేశారు. అదంతా స్క్రిప్ట్ అని నాకు తర్వాత తెలిసింది. ఒక హోస్ట్ గా షో చూసి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్తే బాగుండేది కానీ .. ఆయన అలా చేయలేదు. ఆయనేదో అడుగుతారు .. కడుగుతారు అనుకుంటే .. కూల్ గా వచ్చి హాయ్ అని మాట్లాడే వారు. ఎవరైనా తప్పు చేసినా ఖండించే వారు కాదు. ఒక హోస్ట్ గా నాగార్జున అన్నీ కవర్ చేయాలంటే కష్టమే. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా నాగార్జున ఆడగలేకపోయిన వాటిని నేను అడుగుతున్నాను. ఆడియన్స్ కి క్లారిటీ ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది గీతూ రాయల్.