ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే శనివారం రానే వచ్చింది. బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగుతుంది. మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా 19మందిని హౌస్ లోకి పంపడంతో రచ్చ రచ్చగా కొనసాగుతోంది. ఇటు నాగార్జున తనదైన హోస్టింగ్ తో జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంటే అటు కంటెస్టెంట్లు కూడా దొరికిందే చాన్స్ అన్నట్లుగా హౌస్‌లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్‌ను రఫ్ఫాడిస్తున్నారు.

తొలి వారం, రెండో వారం ఎలిమినేషన్ ఇప్పటికే ముగిసిపోగా ఇప్పుడు ముడో వారానికి వచ్చేసింది. తొలి వారం సరయు, రెండో వారం ఉమా దేవి ఎలిమినేట్ అవ్వగా.. మూడో వారానికి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ప్రియ, మానస్, లహరి, శ్రీరామ చంద్ర, ప్రియాంక సింగ్,నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అత్యంత కీలక ఘట్టాలలో ఒకటైనది సోమవారం జరిగే నామినేషన్ల ప్రక్రియ. ఆ రోజు ఏదొక రచ్చ తప్పకుండా జరగాల్సిందే. అలా మూడో సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియ పెద్ద దుమారాన్నే రేపింది. ముఖ్యంగా సీనియర్ నటి ప్రియ.. కంటెస్టెంట్లు లహరి, యాంకర్ రవి బాత్రూంలో కౌగిలించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై హౌస్ లోని ఇంటి సభ్యులంతా ప్రియపై విరుచుకుపడ్డారు.
తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రియపై నాగార్జున విరుచుకు పడ్డాడు. మరి ముఖ్యంగా ప్రియ,రవి ల మధ్య జరిగిన సంభాషణ గురించి రవి ని నాగార్జున గట్టిగ నిలదీశాడు. ఇదిలా ఉండగా లహరి ని పవర్ రూమ్ కి పిలిచి ఒక వీడియో చూపించాడు నాగార్జున. మరి ఎవరిది తప్పో ఒప్పో తెలియాలంటే ఈ రోజు జరిగే బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం కచ్చితంగా ఎదురు చూడాల్సిందే.