అల్లు అర్జున్ కి లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితిలోనైనా బన్నీ ఒకేలా ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నా.. బన్నీ సరదా టైంను మాత్రం అసలు మిస్ చేసుకోడు. అందుకే, బన్నీ ఫ్రెండ్స్ అందరూ బన్నీతో కంపెనీని బాగా ఇష్టపడతారు. బన్నీలో ఉన్న మరో గొప్ప విషయం.. ప్రొఫెషనల్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ కి లింక్ చేయడు. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ట్రిప్స్ ను అసలు మిస్ కాడు.

నిజానికి బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉంది. అయితే, ప్రెజెంట్ జరుగుతున్న షెడ్యూల్ కి నాలుగు రోజులు గ్యాప్ వచ్చింది. బన్నీ ఈ గ్యాప్ లో తన దుబాయ్ వేకేషన్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. తన కుటుంబంతో కలిపి దుబాయ్ వెళ్ళి సరదగా గడుపుతున్నాడు. బన్నీ దుబాయ్ లో ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఇక బన్నీ ఆ ఫొటోలో స్టైలిష్ లుక్ లో టోటల్ బ్లాక్ డ్రెస్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక బన్నీ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో దుబాయ్ సిటీ అందాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ టైంను ఎంజాయ్ చేయడంలో మొత్తానికి బన్నీ తర్వాతే ఎవరైనా. అన్నట్టు ఐకాన్ స్టార్ గా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి కెరీర్ లో మొదటి సారి అల్లు అర్జున్ (Allu Arjun) భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

Bunny Boy @ Dubai..😍#Pushpa #AlluArjun pic.twitter.com/xj33ZLeyOX
— Arjun 🪓 (@ArjunVc_Online) September 24, 2021

ఎలాగూ హిందీలో బన్నీ సినిమాలు ఇప్పటికే డబ్ అయి భారీ వ్యూస్ తెచ్చుకుని ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. అందుకే పుష్ప విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా సినిమాని పక్కా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నాడు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్. కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.