Bigg Boss Telugu 8 : బిగ్ బ్రేకింగ్ : ‘బిగ్ బాస్ 8’ నుండి మణికంఠ అవుట్..చివరి నిమిషం లో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన నాగార్జున!

గత వారం నిజంగా మణికంఠ చాలా బాగా ఆడాడు, ఈ వారం కూడా ఆయన బాగా ఆడుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. డ్రామాని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటే మణికంఠ టాప్ 5 వరకు వెళ్లి ఉండేవాడని విశ్లేషకుల అభిప్రాయం.

Written By: NARESH, Updated On : October 19, 2024 7:50 pm

Manikanta

Follow us on

Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వారం నామినేషన్స్ లోకి మొత్తం టాప్ కంటెస్టెంట్స్ వచ్చారు. ఎలిమినేట్ ఎవరు అవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొన్న ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా ఓటింగ్స్ ప్రకారం పృథ్వీ రాజ్, టేస్టీ తేజ, హరి తేజ వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. కానీ కాసేపటి క్రితమే అందిన సమాచారం ఏమిటంటే, మణికంఠ ఎలిమినేట్ అయ్యాడని తెలిసింది. ఇది నిజంగా అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. సోషల్ మీడియా ఓటింగ్ లో మణికంఠ టాప్ 3 లో ఉండడం అందరూ చూసారు. అంతే కాదు ఇతను ఫినాలే వరకు వస్తాడని, టైటిల్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని, ఇలా ఎన్నో రకాలుగా ఊహించుకున్నారు.

కానీ ఇలా 7 వ వారం లోనే ఎలిమినేట్ అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. మణికంఠ ఆడుతున్న సానుభూతి డ్రామాలు ఆడియన్స్ ఫిదా అయిపోయారని అందరూ అనుకున్నారు, కానీ ఈ ట్విస్ట్ మాత్రం మణికంఠ ని ద్వేషించే వాళ్ళు కూడా ఊహించలేదు. అయితే మణికంఠ ని కావాలని ఎలిమినేట్ చేసారని ఆయనని అభిమానించే వాళ్ళు అనుకోవచ్చు. మణికంఠ కి గూగుల్ లో కొన్ని వెబ్ సైట్స్ లో టాప్ ఓటింగ్ పడుండొచ్చు కానీ, యూట్యూబ్ చానెల్స్ లో మాత్రం ఓటింగ్ చాలా తక్కువ ఉండేది. కనీసం యష్మీ, అవినాష్ కి పడే ఓట్లు కూడా మణికంఠ కి పడేవి కాదు. అలాగే లక్షల మంది ఉపయోగించే ఇంస్టాగ్రామ్ లో నిర్వహించే పోల్స్ లో కూడా మణికంఠ కే అందరికంటే తక్కువ ఓట్లు పడేవి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అధికారిక ఓటింగ్ లో కూడా మణికంఠ కి తక్కువగానే వచ్చి ఉంటుందని ఊహించొచ్చు. అయితే మణికంఠ ని సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశాలు ఉన్నాయేమో అని అనుకోవచ్చు, కానీ అలాంటిదేమి జరగలేదట.

మణికంఠ ఈ సీజన్ నుండి శాశ్వతంగా ఎలిమినేట్ అయ్యినట్టు చెప్తున్నారు. ఈ వారం మొత్తం ఆయన ఆట ఆడకపోవడం తో పాటు, ప్రతీ విషయాన్ని డ్రామా చేయాలని అనుకోవడం ఆయన ఎలిమినేషన్ కి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అంతే కాకుండా ఎలాంటి కారణం లేకుండా రెండు రోజుల క్రితం ఆయన పృథ్వీ రాజ్ తో హద్దులు దాటి గొడవలు పెట్టుకోవడం, అతన్ని అనరాని మాటలు అనడం వంటివి చూసి, ఇది మణికంఠ అసలు రంగని జనాలు అర్థం చేసుకోబట్టే నేడు మణికంఠ ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. గత వారం నిజంగా మణికంఠ చాలా బాగా ఆడాడు, ఈ వారం కూడా ఆయన బాగా ఆడుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. డ్రామాని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటే మణికంఠ టాప్ 5 వరకు వెళ్లి ఉండేవాడని విశ్లేషకుల అభిప్రాయం.