Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పిలవబడే ఇద్దరు ముగ్గురులో ఒకరు పృథ్వీ రాజ్ శెట్టి. టాస్కులు ఆడడంలో పృథ్వీ రాజ్ ని కొట్టేవాడు లేదని చెప్పాలి. ఎంత కష్టమైన టాస్కుని అయినా ఆయన చాలా అవలీలగా ఆడేస్తాడు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి పృథ్వీ ఎలిమినేట్ అయ్యినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం అనేది ఇంకా తెలియదు కానీ, ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఇంకా జరగలేదు. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమో లో నాగార్జున ‘పృథ్వీ’ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందో ఒకసారి చూద్దాం. ముందుగా నాగార్జున మాట్లాడుతూ ‘బిగ్ బాస్ టైం హెడ్ లైన్స్’ అని ప్రస్తావిస్తూ ‘నిన్న హీరో..నేడు జీరో’ అని మీకు ఎవరు అనిపించింది అని ఒక్కొక్క కంటెస్టెంట్ ని అడుగుతాడు.
ముందుగా హరితేజ నిఖిల్ ని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ‘కండబలం ఉంది కానీ, మెంటల్ గా అతను ఎలాంటి గేమ్ ఆడినట్టు నాకు కనిపించలేదు’ అని అంటుంది. ఆ తర్వాత మొన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ, నిఖిల్ వాష్ రూమ్ లో ఘోరంగా కొట్టుకున్న వీడియో ని ప్లే చేస్తాడు నాగార్జున. ‘ఆటలో ఉత్సాహం, కసి ఉంటే కచ్చితంగా మజా వస్తుంది. కానీ ఇలా కాదు..మీ ఇద్దరి బుద్ధి ఏమైంది’ అని అడుగుతాడు. ఇది ఇలా ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్, పృథ్వీ లలో ఎవరో ఒకరు జుట్టు, గడ్డం కత్తిరించుకుంటే ప్రైజ్ మనీ లో డబ్బులు యాడ్ అవుతాయి అని బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడు. ఈ ఆఫర్ కి పృథ్వీ రాజ్ ఒప్పుకోడు, అవినాష్ ఒప్పుకుంటాడు.
ఫలితంగా 50 వేల రూపాయిలు ప్రైజ్ మనీ లో యాడ్ అవ్వడమే కాకుండా, కిచెన్ సమయం రెండు గంటలు పెరుగుతుంది. అవినాష్ ని బిగ్ బాస్ ప్రత్యేకంగా మెచ్చుకుంటాడు కూడా. అయితే నాగార్జున పృథ్వీ రాజ్ కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. పృథ్వీ గడ్డం కత్తిరించుకుంటే ప్రైజ్ మనీ కి 5 లక్షలు అదనంగా యాడ్ అవుతుంది అని అంటాడు. పృథ్వీ నా గెడ్డం మీద అందరికీ కన్ను పడిందేంటి సార్ అని నవ్వుతూ అంటాడు. అప్పుడు నాగార్జున పృథ్వీ కి మరో బంపర్ ఆఫర్ ఇస్తాడు. ‘నువ్వు గడ్డం కత్తిరించుకుంటే ఏకంగా మూడు వారాలు నామినేషన్స్ నుండి సేఫ్ అవుతావు, నేరుగా 10 వ వారానికి వెళ్ళిపోతావు’ అని అంటాడు. దీనికి పృథ్వీ రాజ్ ఆలోచిస్తాడు, మరి ఆయన ఒప్పుకొని గెడ్డం గీసుకుంటాడా లేదా అనేది మరికాసేపట్లో తెలియనుంది. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం పృథ్వీ ఈరోజు సేవ్ అయితే మూడు వారాలు నామినేషన్స్ లోకి రాడు.