Nagarjuna Dream Role: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న అఖిల్ వరకు ప్రతి హీరో వాళ్ల సత్తా ఏంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వాళ్ళకి మంచి మార్కెట్ ను క్రియేట్ చేశాయి. నాగార్జున సైతం రొమాంటిక్ హీరోగా, మాస్ హీరోగా పలు వైవిద్య భరితమైన పాత్రలను పోషించి స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తన కెరియర్ లో చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న పాత్రలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయనకి ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉందట. ఆయన సూపర్ మెన్ క్యారెక్టర్ లో నటించాలని తనకు ఉందని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశారు. అయినప్పటికి అలాంటి పాత్ర ఇప్పటి వరకు ఆయన చేయలేదు ఇప్పుడు చేసే అవకాశాలు కూడా లేవు అన్నట్టుగా తెలుస్తుంది.
నిజానికి నాగార్జున లాంటి హీరో డేట్స్ ఇస్తే అలాంటి కథ చేసి పెట్టడానికి చాలామంది కుర్రదర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కానీ నాగార్జున మాత్రం సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఫ్యూచర్లో తన డ్రీమ్ ప్రాజెక్టుని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఆయన తన వందో సినిమాని తమిళ దర్శకుడు అయిన రా కార్తీక్ తో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…మొత్తానికైతే నాగార్జున చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్ర ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన చేస్తున్న వందో సినిమాలో డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నారట.
ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు చేయనటువంటి పాత్ర లో నటిస్తున్నాను అంటూ ఆయన చాలా గర్వంగా చెబుతున్నాడు. తన వందో సినిమాని చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేసిన నాగార్జున ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…