Nagarjuna- NTR: సౌత్ హీరోల స్థాయి చిన్నది అంటూ హిందీ హీరోలు మొన్నటి వరకు చిన్నచూపు చూసేవారు. అయితే, ప్రస్తుతం తెలుగు హీరోలు ముఖ్యంగా ప్రభాస్. ఎన్టీఆర్, చరణ్ ల స్థాయి బాలీవుడ్ వరకూ పాకింది. హిందీలో షారుఖ్, సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్స్ కూడా ఇప్పుడు సౌత్ సినిమాల పై సౌత్ దర్శకుల పై పడ్డారు.
మొత్తమ్మీద తెలుగు సినిమా కంటెంటే, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కంటెంట్ గా మారిపోయింది. కానీ 1990వ దశకంలో తెలుగు సినిమా అంటే నార్త్ వాళ్లకు చాలా చులకన భావం ఉండేది. నిజానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో తెలుగు సినిమాలకు ఓ విలువ ఉంది. తమిళ్ స్టార్ హీరోలే కాదు, అటు బాలీవుడ్ స్టార్లు కూడా తెలుగు చిత్రాలను తమ భాషలోకి రీమేక్ చేసుకుని హిట్లు అందుకునే వారు.
Also Read: Balakrishna NBK 107 Bamma Dance: బామ్మ విజిల్స్, డాన్స్.. ఇది బాలయ్య క్రేజ్ అంటే
కానీ, అదేమిటో.. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు చాలా అరుదుగానే వచ్చాయి. పైగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక తెలుగు సినిమా జాతీయ స్థాయిలో మరింత అన్యాయానికి గురి అయ్యింది. కారణం.. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి యాంటీ, కాంగ్రెస్ పార్టీ నిరంకుశ విధానాల పై పోరాడి విజయం సాధించిన వ్యక్తి.
అలాంటి ఎన్టీఆర్ వెంటే.. తెలుగు సినీ ప్రముఖులంతా ఉన్నారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ అధినాయకులు తెలుగు సినిమాకు ఎలాంటి అవార్డు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. నిజానికి ప్రాంతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరిలో ఏదో ఒక చిత్రానికి కచ్చితంగా అవార్డు ఇవ్వాలి.
చివరకు కాంగ్రెస్ పార్టీ ఆ అవార్డును కూడా ఆపేసింది. కేవలం ఎన్టీఆర్ పై కోపంతో ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం అవార్డును కేంద్రం దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇవ్వకుండా పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని సినీయర్ దర్శకుడు గీతాకృష్ణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
గీతాకృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ నటించిన సంకీర్తన సినిమాకు జాతీయ ఆవార్డు రావాల్సి ఉంది. 1987 జాతీయ అవార్డులకు జ్యూరీ మెంబర్‌గా ఉన్న షావుకారు జానకీ కూడా ఇదే విషయాన్ని చెప్పారట. కానీ, ఎన్టీఆర్ పై ఉన్న కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు చిత్రం అయిన పాపానికి ‘సంకీర్తన’ చిత్రానికి అవార్డు ఇవ్వకుండా అడ్డుకుంది. మొత్తానికి ఎన్టీఆర్ కారణంగా నాగార్జున జాతీయ అవార్డు మిస్ అయ్యాడు.
Also Read:Thank You Movie Collections: ‘థాంక్యూ’ 5 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలో తెలుసా ?