Kubera released Date : కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత మన టాలీవుడ్ మొత్తం ఓటీటీ సంస్థ చేతుల్లో కీలు బొమ్మలాగా మారిపోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా సరే, ఎప్పుడు విడుదల అవ్వాలి అనేది ఓటీటీ సంస్థలు నిర్ణయిస్తున్నాయి. ఇంతటి దయనీయమైన పరిస్థితికి టాలీవుడ్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అయితే ఓటీటీ సంస్థల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సంస్థ చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనిపిస్తుంది. నిర్మాతలను వీళ్ళు శాసిస్తున్నారు. ఒక సినిమాని కొన్న తర్వాత వెంటనే డబ్బులు ఇచ్చే అలవాటు వీళ్లకు లేదు. సినిమా విడుదలైన ఆరు నెలలకు ఇస్తారు. అది కూడా సూపర్ హిట్ అయితేనే, లేకపోతే ముందు అనుకున్న ప్రైజ్ ని తగ్గించడం వీళ్లకు షరామామూలే. ఈ సంస్థ కేవలం చిన్న హీరోల సినిమాలను మాత్రమే కాదు , ఈమధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలను కూడా శాసిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమాని కూడా శాసించే స్థాయికి ఈ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఎదిగింది అంటే నమ్ముతారా?, కానీ నిజంగానే శాసించింది. జూన్ 12 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఎవరికీ తెలియదు, అమెజాన్ ప్రైమ్ సంస్థ చెప్పిన డేట్ లోనే విడుదల చేసుకోవాలి. ఇది కాసేపు పక్కన పెడితే ఈ నెల 20 న శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) హీరోలు గా నటించిన కుబేర చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాని కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ 47 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు ఆ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ తెలిపాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా నిర్మాత సునీల్ నారంగ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
Also Read : ‘కుబేర’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్విస్టుకి ఫ్యాన్స్ ఏమైపోతారో!
ఆయన మాట్లాడుతూ ‘మాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడు చాలా టైట్ అయ్యింది. సమయం లేదు, ప్రతీ క్షణాన్ని ఉపయోగించుకుంటున్నాం. అమెజాన్ ప్రైమ్ సంస్థ తో పెద్ద తల నొప్పి, వాళ్ళు చెప్పిన డేట్ లోనే మేము విడుదల చేసుకోవాలి. జూన్ 20 న సినిమాని విడుదల చేయడం కష్టం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది, జులై లో విడుదల చేసుకునేందుకు అనుమతిని ఇవ్వండి అని అమెజాన్ ప్రైమ్ ని రిక్వెస్ట్ చేసాము. కానీ వాడు మాత్రం కుదరదు,మీరు జూన్ 20 న చెప్పారు, అప్పుడే విడుదల చెయ్యాలి, వాయిదా వేస్తే 10 కోట్ల రూపాయిలు కట్ చేస్తాం అని అన్నారు. ఇక వేరే దారిలేక 20 న విడుదల చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ నారంగ్. ఆయన మాటలను బట్టీ చూస్తుంటే నెలకు ఒక రిలీజ్ డేట్ వేస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాతని ఏ రేంజ్ లో ఆడుకొని ఉండుంటారో ఊహించుకోండి.