Kalki 2898AD: ‘కల్కి2898 ఏడి’ మూవీ టికెట్లు తీసుకునే వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తున్న రాజశేఖర్ కల్కి టైటిల్… ఏం జరిగిందంటే..?

Kalki 2898AD: డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇండియా వైడ్ గా స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే బుక్ మై షో లో కల్కి సినిమా టికెట్లను బుక్ చేసిన కొంతమందికి ఒక సర్ప్రైజ్ అయితే కలిగింది.

Written By: Gopi, Updated On : June 24, 2024 9:58 am

Prabhas Kalki 2898 AD Vs Rajasekhar Kalki

Follow us on

Kalki 2898AD: ఈనెల 27వ తేదీన థియేటర్లో రిలీజ్ కాబోతున్న కల్కి సినిమాకు సంబంధించిన తెలంగాణ లోని టికెట్లని ఈరోజు సాయంత్రం బుక్ మై షో లో రిలీజ్ చేశారు. అయితే ఈ రిలీజ్ చేసిన టికెట్లు క్షణాల్లోనే బుక్ అయిపోవడం అనేది నిజంగా ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక మొత్తానికైతే ప్రభాస్ ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు.

ఇక అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇండియా వైడ్ గా స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే బుక్ మై షో లో కల్కి సినిమా టికెట్లను బుక్ చేసిన కొంతమందికి ఒక సర్ప్రైజ్ అయితే కలిగింది. అది ఏంటి అంటే అందరూ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ‘కల్కి ‘ సినిమా టికెట్లను బుక్ చేస్తే గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమా టికెట్లు బుక్ అవుతున్నాయి.

Also Read: Pawan Kalyan : పిక్ ఆఫ్ ది డే : రేణుదేశాయ్ పిల్లలతో అన్నాలెజ్నోవా.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్

ఇక ఇది చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలకు సంబంధించిన రిపీటెడ్ టైటిల్స్ ఉన్నప్పుడు ఆ సినిమా టైటిల్ ముందుగాని, వెనుక గాని ఏదో ఒక టైటిల్ ను యాడ్ చేసి ఫిక్స్ చేస్తూ ఉండేవారు. ఇక ప్రభాస్ కల్కి సినిమాకి కూడా ‘కల్కి 2898 ఏడి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినప్పటికీ అందరూ కల్కి కల్కి అంటూ మాత్రమే పిలుస్తున్నారు.

Also Read: Kalki 2898 AD: కల్కి మూవీ అన్ని వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందా..? సక్సెస్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రావాలంటే..?

కాబట్టి ఆ కల్కి కి, ఈ కల్కి కి మధ్య ఉన్న తేడా గుర్తించలేకపోవడం వల్ల రాజశేఖర్ కల్కి సినిమా టికెట్లు కూడా బుక్ అవుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక మొత్తానికైతే ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసిన కల్కి టైటిల్ మీద ఆసక్తికరమైన కామెంట్లైతే వస్తున్నాయి…