Nagarjuna
Nagarjuna : నాగార్జునను చూస్తే ప్రతి మగవాడు కుళ్ళుకుంటాడు. ఆయన వయసుకు, గ్లామర్ కి అసలు సంబంధం ఉండదు. ఓ ఇరవై ఏళ్ళు ఆయన దాచేశాడు. నాగార్జున ప్రస్తుత వయసు 65 ఏళ్ళు. కానీ ఆయన ఆ విధంగా కనిపించరు. తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ పక్కన నిల్చుంటే.. వారిని డామినేట్ చేసేలా ఉంటాడు. ముగ్గురు అన్నదమ్ములా అన్నట్లు ఉంటుంది. 80-90లలో నాగార్జున టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్ తో ఆయన బ్లాక్ బస్టర్స్ కొట్టారు.
నాగార్జున ఫిట్నెస్ రహస్యం ఏమిటంటే ఆయన పలు సందర్భాల్లో వెల్లడించాడు. వారసత్వంగా తండ్రి నుండి వచ్చింది కొంత అంటారు. అలాగే ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం. నాగార్జున ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు. మంచి ఆహారం తింటారు. సన్నగా ఉండాలని డైట్ చేయడం, కడుపు మాడ్చుకోవడం నాగార్జున చేయరు అట. కడుపునిండా తింటారట. తన ఆహారంలో వెజిటబుల్స్, ఆకు కూరలు, చికెన్, ఫిష్ ఉండేలా చేసుకుంటాడట. రాత్రి పూట రెండు పెగ్గులు కూడా వేస్తాడట.
Also Read : శివమణి కాంబినేషన్ రిపీట్ కానుందా..? అక్కినేని ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున!
పడుకునే ముందు ఫోన్ చూడరు అట. త్వరగా పడుకుంటాడు అట. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి కలిగి ఉండటమే నా ఫిట్నెస్ సీక్రెట్ అని నాగార్జున వెల్లడించారు. ఇక నాగార్జున కెరీర్ పరిశీలిస్తే… ఆయన ఒకింత స్ట్రగుల్ అవుతున్నారు. సోలోగా మంచి హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం తర్వాత ఆయనకు ఆ రేంజ్ హిట్ పడలేదు. ఆయన గత చిత్రం నా సామిరంగా పర్లేదు అనిపించుకుంది. మరోవైపు బాలకృష్ణ, చిరంజీవి తమ ఫార్మ్ కొనసాగిస్తున్నారు. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం విశేషం. ఏకంగా 300 కోట్ల మార్క్ చేరుకొని చిరు, బాలయ్యలను కూడా అధిగమించాడు. ఈ క్రమంలో నాగార్జున కూడా ఒక సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కూలీ, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూలీ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోని నాగార్జున పాత్రపై ఆసక్తి నెలకొంది. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీ. నాగార్జున బరువైన భావోద్వేగాలతో కూడిన పాత్ర చేస్తున్నాడట. రష్మిక, ధనుష్ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
Also Read : ఆ విషయంలో నాగార్జున కి కండిషన్స్ పెట్టిన ఏకైక హీరోయిన్ ఆమె ఒక్కటేనా..? అసలు ఏమైందంటే!
Web Title: Nagarjuna 65 years handsome viral look
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com