Homeఎంటర్టైన్మెంట్Nagarjuna 100th Movie Leaked Scene: లీకైన నాగార్జున 100వ సినిమా సన్నివేశం..ఈ రేంజ్ లో...

Nagarjuna 100th Movie Leaked Scene: లీకైన నాగార్జున 100వ సినిమా సన్నివేశం..ఈ రేంజ్ లో ఉందేంటి..

Nagarjuna 100th Movie Leaked Scene: అక్కినేని అభిమానులు ఇప్పుడు నాగార్జున వందవ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని అంటున్నారు. సీనియర్ హీరోలందరూ వరుసగా సూపర్ హిట్స్ కొడుతూ నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరిస్తుంటే , నాగార్జున క్యారెక్టర్ రోల్స్ , విలన్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ కి మింగుడు పడని విషయం అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం లో నాగార్జున పోషించిన విలన్ పాత్ర అభిమానులను తీవ్రమైన నిరాశకు గురయ్యేలా చేసింది. ఇలాంటి సమయం లో నాగార్జున నుండి హీరో గా భారీ కం బ్యాక్ ని కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఆ కం బ్యాక్ కచ్చితంగా 100 వ సినిమాతో జరుగుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు.

ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు. కానీ ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ షాట్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. హీరోయిన్ టబు ని జనాలు కొట్టేందుకు ముందుకు రాగా, నాగార్జున ఆమెని కారు నుండి జాగ్రత్తగా బయటకు దింపి లోపలకు తీసుకెళ్తున్న షాట్ ని చూస్తుంటే , ఇదొక ఇంటెన్స్ యాక్షన్ చిత్రంగా అనిపిస్తోంది. నాగార్జున లుక్ ‘కూలీ’ చిత్రం లో ఎలా ఉందో, ఇందులో కూడా అలాగే ఉంది. ఈ షాట్ ని చూసిన తర్వాత అభిమానుల్లో ఈ చిత్రం పై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఒక బడా సూపర్ స్టార్ ఈ చిత్రం లో క్యామియో రోల్ చేసే అవకాశం ఉందని , అది మెగాస్టార్ చిరంజీవి అవ్వొచ్చని చాలా రోజుల నుండి ఒక రూమర్ నడుస్తోంది , మరి ఈ రూమర్ లో ఎంత మాత్రం నిజముందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by @edaina_sare

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular