Nagarajuna Kubera Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలో నాగార్జున (Nagarajuna) లాంటి హీరో సైతం తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. హీరోగా సినిమాలను చేస్తూనే, డిఫరెంట్ పాత్రలను కూడా పోషిస్తూ తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల (Shekar Kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా వస్తున్న కుబేర (Kubera)సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తనలోని నటుడిని బయటికి తీసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన నటనను కనబరిచే హీరోల్లో తను కూడా ఒకడిగా మారిపోతున్నట్టుగా తెలుస్తోంది…అయితే కుబేర సినిమాని తను ఒప్పుకోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అంటే శేఖర్ కమ్ముల డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పిన క్యారెక్టర్ లో నటించడానికి ఎక్కువగా స్కోప్ ఉందని చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: Akkineni Nagarjuna : జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన అక్కినేని నాగార్జున!
ఈ మధ్యకాలంలో ఆయన అన్ని పాజిటివ్ క్యారెక్టర్లు చేస్తూ హీరోగానే చేస్తున్నాడు. కాబట్టి తనలోని పూర్తి స్థాయి నటనను బయటికి తీసే సమయమైతే రావడం లేదు. ఇక ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చేసినప్పుడే ఆయనకి ఒక మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతో నాగార్జున ఈ క్యారెక్టర్ ని ఓకే చేసినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున ఇకమీదట చేసే సినిమాల విషయంలో కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Shekar Kammula) కూడా మంచి సక్సెస్ ను సాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతున్నట్టుగా ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది…