Homeఆంధ్రప్రదేశ్‌YSRCP New strategist Position: వైసీపీకి వ్యూహ కర్తగా సరైనోడు.. జగన్ ఎంపిక!

YSRCP New strategist Position: వైసీపీకి వ్యూహ కర్తగా సరైనోడు.. జగన్ ఎంపిక!

YSRCP New strategist Position: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు. ప్రజల్లోకి వచ్చి బలమైన వాయిస్ వినిపించాలని నిర్ణయానికి వచ్చారు. త్వరలో జిల్లాల పర్యటనకు కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పార్టీలో కీలక నియామకాలు చేపట్టారు. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్ళగా.. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. అయితే ఇలా కార్యాచరణ ముందుకు సాగుతుండగా.. మరోవైపు రాజకీయ వ్యూహకర్తల ఎంపికలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఓ సీనియర్ వ్యూహకర్తను రంగంలోకి దించుతారని సమాచారం. బెంగళూరు వేదికగా ప్రస్తుతం చర్చలు పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న వ్యూహకర్తను తప్పించి.. కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. త్వరలో పార్టీ శ్రేణులకు సైతం పరిచయం చేస్తారని సమాచారం.

వైసిపి గెలుపులో కీలక పాత్ర..
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా పోటీ చేసింది. అధికారానికి కూత వేటు దూరంలో నిలిచిపోయింది. 67 సీట్లతో సరిపెట్టుకుంది. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )తన వ్యూహం మార్చారు. రాజకీయ వ్యూహాల కోసం ఐ ప్యాక్ తో ఒప్పందం చేసుకున్నారు. దానికి సారథిగా ప్రశాంత్ కిషోర్ ఉండేవారు. అయితే నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా కీలకం. జగన్ పాదయాత్ర, పార్టీలో చేరికలు, ఎన్నికల హామీలు, ప్రచార తీరు వెనుక ఉండి నడిపించారు ప్రశాంత్ కిషోర్. 151 సీట్లతో సూపర్ విక్టరీ సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నారు. స్వరాష్ట్రం బీహార్లో పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు.

Also Read: MLA Yashaswini Reddy: జర్నలిస్టులను బెదిరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త .. వైరల్ వీడియో

పీకే నిష్క్రమణతో..
2019 ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్( Prashant Kishor) సహచరుడు రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐప్యాక్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించింది. 2024 ఎన్నికల్లో కూడా అదే బృందం సేవలందించింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. అయితే ఎన్నికల వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం కూటమికి పరోక్షంగా సేవలందించారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబును కలిశారు ప్రశాంత్ కిషోర్. ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు టిడిపి కూటమికి విలువైన సలహాలు అందించారు. వైసిపి హయాంలో మద్యం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి వాటిని హైలెట్ చేసింది ప్రశాంత్ కిషోర్ అని తెలుస్తోంది. మరోవైపు పెన్షన్ల పెంపు, వలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ వేనని తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి లోకేష్ ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అంటే ఇప్పటికీ ఆయన సలహాలు సూచనలు టిడిపి కూటమికి అందిస్తున్నారన్నమాట. ఇప్పటికీ టిడిపికి రాబిన్ శర్మ నేతృత్వంలోని షో టైం కన్సల్టెన్సీ సేవలందిస్తోంది.

Also Read: YSR Congress Party : అరెస్ట్ భయాలు.. తెరపైకి వైసీపీలో నెంబర్ 2

ఆ సీనియర్ వ్యూహకర్తవైపు..
ఒకవైపు ప్రశాంత్ కిషోర్, ఇంకోవైపు షో టైం కన్సల్టెన్సీ ( show time consultancy ) సేవలు కొనసాగుతుండడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యూహకర్తగా ఉన్న రుషిరాజ్ సింగ్ స్థానంలో ఒక సీనియర్ వ్యూహకర్తను నియమించుకునే పనిలో పడినట్లు సమాచారం. కర్ణాటక తో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యూహకర్తతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రుషిరాజ్ సింగ్ తిరిగి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సుముఖంగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహకర్తను నియమించుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో పార్టీ శ్రేణులకు సైతం పరిచయం చేస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular