Nagababu
Nagababu : ఇటీవల కాలం లో నాగబాబు(Konidela Nagababu) ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపికై శాసనమండలి కి ఏకపక్షంగా ఎంపికైన వారిలో ఒకడిగా నిల్చిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు కి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం పై కొంతమంది జనసైనికుల్లో కూడా సంతృప్తి లేదు. ఎందుకంటే అటు చిరంజీవి(Megastar Chiranjeevi) కి కానీ, ఇటు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి కానీ నాగబాబు మాట్లాడే మాటలు ఒక్కసారి తలవంపులు తెచ్చిపెడుతుంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం భయపడుతూ ఉంటారు. ఆయన మైక్ అందుకుంటే అభిమానులు కూడా వణికిపోతుంటారు. నేడు ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నో ఆణిముత్యాలు వదిలాడు. ముఖ్యంగా పిఠాపురం వర్మ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి రూల్స్ ని బ్రేక్ చేసినట్టుగా అనిపించింది. ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పుట్టుక గురించి మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు.
Also Read : జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ పిఠాపురం వర్మపై నాగబాబు సెటైర్లు..మండిపడుతున్న టీడీపీ అభిమానులు!
ఆయన మాట్లాడుతూ ‘మా అమ్మ నాకు కళ్యాణ్ బాబు గురించి చెప్పిన ఒక మాటని విని షాక్ కి గురయ్యాను. కళ్యాణ్ బాబు పుడుతున్నప్పుడు నాకు ఇసుమంత నొప్పి కూడా తెలియలేదు అని చెప్పింది. అదేంటమ్మా కనీసం కొద్దిగా అయిన నొప్పులు ఉంటాయి కదా అని నేను అడిగితే, ఏమోరా నాకు ఏమాత్రం నొప్పి తెలియనివ్వకుండా పుట్టాడు అని చెప్పింది. పుట్టేటప్పుడు కన్నతల్లికి ఏ మాత్రం నొప్పి కలిగించకుండా పుట్టిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేడు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక జనాలకు నొప్పి ఎలా కలిగిస్తాడు. ఏమాత్రం కష్టం తెలియకుండా గుండెల్లో పెట్టుకొని జనాలను చూసుకుంటాడు. అదే ఈరోజు మీరంతా చూస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలకు జనసైనికులు సైతం వెనకేసుకొని రాలేకపోతున్నారు. ఆ రేంజ్ వ్యాఖ్యలు చేసాడు.
Also Read : ఒకే ఒక్కడు నాగబాబు.. నిజంగా రికార్డే!
పవన్ కళ్యాణ్ పుట్టుక గురించి నాగబాబు జ్ఞాన గుళిక వినండి … వామ్మో @JanaSenaParty @PawanKalyan pic.twitter.com/Ih41ACVKt5
— Songs Lover (@Songs_Lover_) March 14, 2025