Homeఆంధ్రప్రదేశ్‌Nagababu : ఒకే ఒక్కడు నాగబాబు.. నిజంగా రికార్డే!

Nagababu : ఒకే ఒక్కడు నాగబాబు.. నిజంగా రికార్డే!

Nagababu : జనసేన నేత నాగబాబు ( Jana Sena leader Nagababu )ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ అయినట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఆయనతోపాటు టిడిపి నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బిజెపి నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అయితే నాగబాబు మరో రికార్డుకు చేరువయ్యారు. ఆయనను క్యాబినెట్ లోకి తీసుకుంటే.. శాసనమండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా ఆయన గుర్తింపు పొందుతారు. ఇప్పటివరకు శాసనమండలి నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు చంద్రబాబు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆ అవకాశం ఇవ్వలేదు. తొలిసారిగా జనసేన కు ఈ అరుదైన అవకాశం దక్కనుంది.

Also Read : ఇండియన్ టీంతో జనసేనకు పోలిక.. నాగబాబు సంచలన కామెంట్స్!

* అప్పట్లో మంత్రులుగా ఎమ్మెల్సీలు
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అప్పట్లో శాసనమండలి సభ్యులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, నారాయణ లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. అప్పట్లో వారిద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు. దీంతో క్యాబినెట్లో కూర్పులో భాగంగా వారిద్దరికీ అవకాశం ఇచ్చారు. మరోవైపు మంత్రిగా నారా లోకేష్ కు తొలి అవకాశం ఇచ్చారు. అనంతరం ఆయనను ఎమ్మెల్సీ చేశారు. కానీ ఈసారి ఆ అవకాశం లేదు. లోకేష్ మంగళగిరి నుంచి గెలిచారు. నారాయణ నెల్లూరు నుంచి విజయం సాధించారు. యనమల రామకృష్ణుడు బదులు ఆయన కుమార్తె దివ్య తుని నుంచి గెలిచారు. శాసనమండలి నుంచి ఎవ్వర్నీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

* ఎంపీగా పోటీ చేయాలని..
వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఎంపీగా( member of parliament) పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టాలన్నది నాగబాబు ఆలోచన. అందుకు తగ్గట్టుగానే అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో కుదరలేదు. నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎన్నికల్లో కూటమి సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. కూటమి గెలుపునకు కృషి చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు ఎంపికై పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావించారు. రాజ్యసభ పదవి దక్కక పోయేసరికి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడంతో త్వరలో నాగబాబును మంత్రిగా తీసుకోవడం ఖాయమని తేలుతోంది.

* మెగా ఫ్యామిలీకి అరుదైన ఛాన్స్
నాగబాబు మంత్రి అయితే మెగా కుటుంబం( mega family) సరికొత్త రికార్డు సృష్టించినట్టే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అనుకున్నది సాధించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి పొందారు. జనసేన ను ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నారు. సినీ రంగం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పదవులు అందుకోవడం ఇదే తొలిసారి.

Also Read : *మెగా బ్రదర్ నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఎన్ని కోట్లంటే?*

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version