Deputy CM Pawan Kalyan: సోషల్ మీడియా లో ఇప్పుడు తెలుగు దేశం(Telugu Desam Party), జనసేన పార్టీ(Janasena Party) అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ కూటమి పార్టీల అభిమానుల మధ్య ఇలాంటి వాతావరణం ఏర్పడడానికి కారణం నిన్న పిఠాపురం లో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభ. జనసేన జయకేతనం పేరుతో నిర్వహించబడిన ఈ సభకు దాదాపుగా 7 లక్షల మంది జనసైనికులు హాజరయ్యారని జనసేన శ్రేణులు చెప్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సభలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మంచి ప్రసంగమే ఇచ్చాడు కానీ, ఆయన తెలుగు దేశం ని ఉద్దేశించి మాట్లాడిన ఒకే ఒక్క మాట ఈరోజు ఇరు పార్టీల అభిమానుల మధ్య చిచ్చు రేపింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అభిమానులు శత్రువులు మాదిరి మారిపోయి సోషల్ మీడియా లో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కేవలం ఈ ఒక్క ఆవిర్భావ సభ వల్లే కాదు కానీ, గత రెండు నెలల నుండి సోషల్ మీడియాలో ఇరు పార్టీల అభిమానుల మధ్య గొడవలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఇంతకీ ఏమి మాట్లాడాడంటే ‘ఐదేళ్ల పాటు ఎన్నో అవమానాలు భరించాం, ఎన్నో దౌర్జన్యాలు ఎదురుకున్నాం. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. బలంగా మన పార్టీ ని నిలదొక్కుకోవడమే కాకుండా, అటు కేంద్రం లో బీజేపీ పార్టీ ని, ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ ని నిలబెట్టాం. కష్టసమయంలో చెయ్యి అందించిన విషయాన్ని గుర్తించుకొని చంద్రబాబు నాయుడు గారు నాకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో నిల్చునే అవకాశం కల్పించాడు. ఈ సందర్భంగా ఆయనకు కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు కి కృతఙ్ఞతలు తెలియచేసిన విషయాన్ని మర్చిపోయారు కానీ, పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ నిలబడింది అనే వ్యాఖ్యలను మాత్రం గుర్తుపెట్టుకొని బాగా ట్రిగ్గర్ అయ్యారు. దీంతో ఇరువురి పార్టీల అభిమానుల మధ్య గొడవలు ఏర్పడ్డాయి.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగు దేశం పార్టీ కి, అదే విధంగా చంద్రబాబు(CM Chandrababu Naidu) లేకపోతే జనసేన పార్టీ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మనుగడ సాగించడం కష్టమనే సత్యాన్ని గ్రహించాలి అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు విడివిడిగా పోటీ చేస్తే, మరో పది సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ పార్టీ రాజకీయాల్లో ఉంటే అధికారం చేపట్టే అవకాశం ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. కాబట్టి ఎవరు గొప్ప అనే అంశాన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
మనం నిలబడ్డాం, నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టాం – పవన్ కళ్యాణ్ pic.twitter.com/4Xbd7imSXd
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2025