Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టైటిల్ కొట్టేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నప్పటికీ, మంచితనం కారణంగా తనలోని ఫైర్ ని బయటకు తియ్యలేక, కంటెస్టెంట్స్ బంధాల మధ్య నలిగిపోతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది భరణి మాత్రమే. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఆడియన్స్ ఈయన కచ్చితంగా టైటిల్ గెలుస్తాడు అని అనుకున్నారు. ఆయన ఆట కూడా ఆ రేంజ్ లోనే ఉండేది. అంతే కాకుండా హౌస్ లో ఉన్న సెలబ్రిటీలు అందరికీ లీడర్ లాగా వ్యవహరించేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాలుగు వారాలు హౌస్ లోని కంటెస్టెంట్స్ ని శాసించాడు. కానీ తనూజ తో ఆయన పెట్టుకున్న తండ్రి రిలేషన్, అదే విధంగా దివ్య తో పెట్టుకున్న అన్న రిలేషన్ కారణంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల 5 వ వారం లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
అయితే తనకు ఉన్నటువంటి పలుకుబడి కారణం చేతనో, లేకపోతే వేరే ఏ కారణం చేతనో తెలియదు కానీ, రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ రీ ఎంట్రీ లో కచ్చితంగా ఆయన దుమ్ము దులిపేస్తాడని అంతా అనుకున్నారు. అలా ఆడేందుకే ఆయన సిద్ధం అయ్యాడు కూడా. అందుకే వచ్చిన మొదటి రోజే వయస్సు కూడా మర్చిపోయి టాస్కులు ఆడాడు. ఆ కారణం చేత స్విమ్మింగ్ పూల్ లో జారీ పడిపోవడం తో, దెబ్బలు బాగా తగిలాయి. ఆ దెబ్బలతోనే తనకు తోచిన విధంగా గేమ్స్ ఆడుకుంటూ ముందుకు వస్తున్నాడు,. ఈ వారం నామినేషన్స్ లో అదరగొట్టేసాడు. దీంతో ఆయన తనకంటూ ఒక సాలిడ్ ఓటు బ్యాంకు ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పటి కంటే ప్రస్తుతం భరణి ఓటింగ్ భారీ గా పెరిగింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే వచ్చే వారం నుండి భరణి ఓటింగ్ మూడింతలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే మెగా బ్రదర్ నాగబాబు భరణి కోసం బిగ్ బాస్ 9 స్టేజి మీదకు రాబోతున్నాడు. నాగబాబు ఒక కంటెస్టెంట్ కి సపోర్టుగా రావడం అనేది చిన్న విషయం కాదు. నాగబాబు వచ్చాడు అంటే మెగా ఫ్యాన్స్ మొత్తానికి భరణి మనోడు అనే విషయం తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అయితే కళ్ళు మూసుకొని భరణి కి ఓట్లు గుద్దేస్తారు. షో చూడని వాళ్ళు కూడా భరణి కి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. అలా ఆయన గ్రాఫ్ వచ్చే వారం నుండి అమాంతం పెరుగుతాయి. ఆ జోష్ ని కొనసాగిస్తూ ఒక్క సరైన టాస్క్ పడితే మాత్రం టైటిల్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ లో ఉండబోతోంది. నాగబాబు మాత్రమే కాదు, భరణి తల్లి కూడా స్టేజి మీదకు రాబోతుంది. కాబట్టి భరణి కి ఇది ఆల్ట్రా పాజిటివ్ ఎపిసోడ్ కానుంది.