Rajinikanth: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) ని మళ్లీ గాడిలో పెట్టిన చిత్రం ‘జైలర్’. ఇక రజినీకాంత్ పని అయిపోయింది, హీరో గా పనికిరాడు, ఆయన సినిమాలను ఆడియన్స్ చూడడం మానేశారు అని అందరూ అనుకుంటున్న సమయం లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసింది. ఒకే ఒక్క దెబ్బకు సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయ్యింది. నేటి తరం ఆడియన్స్ కి రజినీకాంత్ లో ఇంత స్టామినా ఉందా అని ఆశ్చర్యపోయేలా చేసింది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అలాంటి సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.
ఇదంతా పక్కన పెడితే ‘జైలర్ 2’ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ కి ముచ్చటగా మూడవసారి రజినీకాంత్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ లో రీసెంట్ గానే సుందర్ సి దర్శకత్వం లో రజినీకాంత్ హీరో గా ఒక సినిమా రాబోతుందని అధికారిక ప్రకటన చేశారు. కానీ ఎందుకో ఈ ప్రకటన వచ్చిన రెండు మూడు రోజులకే సుందర్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. దీంతో ఈ అవకాశం నెల్సన్ కి వచ్చి చేరింది. కానీ ఆయన సున్నితంగా ఈ ఆఫర్ ని తిరస్కరించాడు. ఎందుకంటే ‘జైలర్ 2’ తర్వాత ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యి ఉన్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. అడ్వాన్స్ కూడా భారీగానే అందుకున్నాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ ని ఆయన రిజెక్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
నెల్సన్ తప్పుకోవడం తో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల్లోకి వెళ్లిందని సమాచారం. త్రివిక్రమ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించబోతుందని మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు రజినీకాంత్ సినిమాకు త్రివిక్రమ్ షిఫ్ట్ అయితే వెంకటేష్ సినిమా పరిస్థితి ఏంటి?, రజినీకాంత్ తో సినిమా మొదలు అయ్యేలోపు చాలా సమయం పడుతుంది కాబట్టి, ఈ లోపు విక్టరీ వెంకటేష్ తో సినిమాని పూర్తి చేసే ప్లాన్ త్రివిక్రమ్ వేసుకున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.