రాజకీయాల్లో మిత్రులు ఎంత మంది ఉంటారో.. అంతకంటే రెట్టింపు స్థాయిలో శత్రువులు ఉంటారు. కానీ.. రాజకీయాల్లో శత్రువుల కంటే మిత్రులనే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని అంటుంటారు ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే.. శత్రువులు ఎక్కువయ్యే కొద్దీ సమస్యలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పటికీ భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం పొరుగు రాష్ట్రం నేతల అవసరం ఎప్పటికైనా వస్తుందని జగన్ ఆలోచనలో ఉన్నారు. అందుకే తెలంగాణలో వైసీపీని నిర్వీర్యం చేసేందుకే డిసైడ్ అయ్యారు.
Also Read: బ్రేకింగ్: నేను పార్టీ పెట్టడం అన్నయ్య జగన్ కు ఇష్టం లేదు: షర్మిల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో టీడీపీ లాగానే వైసీపీ కాకూడదనుకున్నారు జగన్. టీడీపీ అనేక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయి ఇబ్బంది పడుతోంది. పైగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదన్నది జగన్ అభిప్రాయం. తనను బయటకు గెంటేసిన కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రాకూడదనే తొలినుంచి జగన్ కేసీఆర్ కు దగ్గరవుతూ వస్తున్నారు. అనేక సార్లు కేసీఆర్‌తో భేటీ అయిన జగన్ రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించారు.
Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్: సీఎం జగన్ మరో సాహసోపేత నిర్ణయం..
అంతేకాదు.. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కూడా హాజరై ఆశీర్వదించారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. జలవివాదాలు అప్పడప్పుడు తలెత్తుతున్నా అవి పైకి మాత్రమేనంటారు. లోపల మాత్రం జగన్ ఏపీలో స్థిరంగా కొనసాగాలని కేసీఆర్ భావిస్తారు. అలాగే జగన్ కూడా తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే ఉండాలని కోరుకుంటారు. అందుకే తెలంగాణలో వైసీపీని పూర్తిగా జగన్ పడుకోబెట్టేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అందుకే.. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లుగా అంటున్నారు. వైసీపీని తెలంగాణలో బలోపేతం చేయడం ఇష్టపడని జగన్ ఆ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో షర్మిల కొత్త పార్టీవైపు మొగ్గు చూపారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా మూకుమ్మడిగా షర్మిల పార్టీలోకి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. షర్మిల జగన్ మాట వినకుండా కొత్తగా పార్టీ పెడితే చేతులు కాల్చుకోవాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.