Nagababu : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపికైన మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు(Konidela Nagababu) నిన్న శాసన మండలి(Legislative Council) చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు సమక్ష్యంలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు, మరియు పలువురు జనసేన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు తన సతీమణి తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ని కలిసాడు. చంద్రబాబు నాయుడు నాగబాబు కు గౌరవ సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేసాడు. అంతే కాకుండా క్యాబినెట్ విస్తరణలో నాగబాబు ఈ నెలలోనే మంత్రివర్గంలోకి అడుగుపెట్టబోతున్నాడని ఒక టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పుడే మంత్రివర్గంలోకి చేర్చుకుంటే అస్సమ్మతి రగిలే అవకాశం ఉన్నందున కొన్ని రోజులు వాయిదా వేసినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజం అనేది పక్కన పెడితే, చిరంజీవి(Megastar Chiranjeevi) ట్విట్టర్ లో వేసిన లేటెస్ట్ ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
Also Read : నాగబాబు కోసం వారిని తప్పిస్తారా? ఉగాదికి పొలిటికల్ హీట్!
‘ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన నా తమ్ముడు కొణిదెల నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో ఇట్లు నీ అన్నయ్య, వదిన’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. అంతే కాకుండా చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా చిరంజీవి నాగబాబుకు ఒక ప్రత్యేకమైన పెన్ ని బహుమతిగా అందించాడు. ఆ పెన్ తోనే నాగ బాబు ప్రమాణస్వీకార పత్రాలపై సంతకాలు చేసాడు. చిరంజీవి వేసిన ఈ ట్వీట్ కి నాగ బాబు నుండి కూడా రెస్పాన్స్ వచ్చింది. ‘ప్రియమైన అన్నయ, మీ ప్రేమాభిమానాలకు నేను ధన్యుడిని. మీరు, వదిన బహుకరించిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈ పెన్ ని ఉపయోగించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే నాగ బాబు MLC అవ్వడంపై మొదటి నుండి టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా లో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గతంలో నాగబాబు టీడీపీ పై, టీడీపీ నేతలతో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పై ఆయన వేసిన సెటైర్లే అందుకు కారణం. MLC అయ్యినందుకే ఇంతటి వ్యతిరేకత చూపిస్తుంటే, ఇక మంత్రి వర్గంలోకి అడుగుపెడితే ఏ రేంజ్ వ్యతిరేకత ఏర్పడుతుందో అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ముక్కుసూటి తనంతో తన మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడే నాగబాబు వ్యాఖ్యలు ఎదో ఒకరోజు కూటమి మైత్రి ని దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. కనీసం మండలి లో అయినా నాగబాబు నోరు అదుపులో పెట్టుకొని, ప్రత్యర్థి వైసీపీ పార్టీ ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధిస్తారని కూటమి అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read : నాగబాబు మంత్రి పదవి.. అంత కాలం లేటు అంట