spot_img
Homeఎంటర్టైన్మెంట్Nagababu Jabardasth: 'జబర్దస్త్' లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది ‘జబర్దస్త్’ మాత్రమే. ఈ బిగ్గెస్ట్ కామెడీ షో నుండి ఇప్పటి వరకు మన టాలీవుడ్ లోకి ఎంత మంది కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేడు ఇండస్ట్రీ లో వీళ్లంతా గొప్ప స్థాయిలో ఉన్నారు. అయితే వీళ్లంతా జబర్దస్త్ ని ఎప్పుడైతే వదిలేసారో , అప్పటి నుండే ఈ షో క్రేజ్ బాగా పడిపోయింది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అందుకే గతం లో గురు , శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ కామెడీ షో, ఆ తర్వాత శుక్ర , శనివారాలు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు టీఆర్ఫీ రేటింగ్స్ ఇంకా పడిపోవడం తో ఆదివారం కి షిఫ్ట్ చేశారు.

ఈ నెల 26 నుండి ఈ కామెడీ షో ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ సరికొత్త వెర్షన్ లో హైపర్ ఆది గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. హైపర్ ఆది కంటే ముందుగా నాగబాబు జడ్జీగా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడం జబర్దస్త్ ఆడియన్స్ లో మంచి జోష్ ని తీసుకొచ్చింది. గతం లో ఈ షో నుండి వెళ్లిపోయిన మొట్టమొదటి వ్యక్తి నాగ బాబే. ఆ తర్వాత రోజా కూడా కొన్నాళ్ళకు ఈ షో నుండి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత చమ్మక్ చంద్ర , హైపర్ ఆది , సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను , ఇలా జబర్దస్త్ కి వెన్నుముక లాగా ఉన్న ప్రతీ ఒక్కరు సినిమాల్లో బాగా అవకాశాలు రావడం తో ఈ షో నుండి నుండి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఒక్కొకరుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాగబాబు తో మొదలైన రీ ఎంట్రీ , హైపర్ ఆది వరకు చేరింది.

రాబోయే రోజుల్లో చమ్మక్ చంద్ర , గెటప్ శ్రీను వంటి వారు కూడా రీ ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇదంతా పక్కన పెడితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు కి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నట్టు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కి నాగబాబు 5 నుండి 10 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆయనతో పాటు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా ఈ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు కూడా రెమ్యూనరేషన్ గట్టిగానే ఇస్తున్నారట. ఇలా జబర్దస్త్ లో జరిగిన ఈ మార్పులు , చేర్పులు , ఆ షో ని ఎక్కడికి తీసుకెళ్లి ఆపుతుందో చూడాలి. గురువారం నుండి ఆదివారం కి షిఫ్ట్ అయ్యింది. ఇక ఇప్పటికీ కూడా టీఆర్ఫీ రేటింగ్స్ రాకపోతే, ఈ షో మనుగడకి ప్రమాదం అని చెప్పొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper