Chiranjeevi Gang Leader: అయితే కొణిదెల శివశంకర వర ప్రసాద్ చిరంజీవిగా ఎదిగిన తీరు తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. చిరంజీవి స్వయం కృషితో మెగాస్టార్ అయ్యాడు. ఎంతోమందిని ఆదుకుని ఆపద్బాంధవుడుగా మారాడు. తన నటనతో ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత నంబర్ వన్ హీరోగా ఎదిగారు. చిరు నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను రక్షించింది. రాజకీయ పార్టీని స్థాపించి ప్రభంజనం సృష్టించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

కాగా చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు వరించింది.
Also Read: OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాల్సిందే. ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లకు, నటనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే గ్యాంగ్ లీడర్ మూవీ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి నటించగా రికార్డులు సృష్టించింది. చిరు మెగా ఇమేజ్‌ను సుస్థిరం చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి.

అయితే గ్యాంగ్ లీడర్ చిత్రంలో నిజానికి మొదట హీరో చిరంజీవి కాదని చెబుతున్నారు. మరో హీరోను దృష్టిలో పెట్టుకుని పరుచూరి బ్రదర్స్ గ్యాంగ్ లీడర్ కథ సిద్ధం చేశారంట. అయితే 90వ దశకం మొదట్లో కొండవీటి దొంగ సినిమాలో నాగబాబు కీలక పాత్రలో నటించాడు. అందులో మెగా బ్రదర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అప్పటి వరకు చిన్నాచితకా పాత్రలు చేస్తూ వచ్చిన తన తమ్మున్ని హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలో.. పరుచూరి బ్రదర్స్ ఆ బాధ్యత తీసుకోడానికి ముందుకొచ్చారని.. అప్పుడే గ్యాంగ్ లీడర్ కథకు బీజం పడిందని చెబుతున్నారు విశ్లేషకులు. టైటిల్ కూడా షోలే సినిమాలో ఫేమస్ అయిన అరె ఓ సాంబ అని పెట్టారు. దర్శకుడిగా విజయ బాపినీడును ఎంచుకున్నారు కూడా.
అయితే ఈ కథ మొత్తం అయిపోయిన తర్వాత తనకు ఇది అస్సలు సూట్ కాదని.. మెగా ఇమేజ్ ఉన్న అన్నయ్యకే సరిపోతుందని నాగబాబు చెప్పడంతో కథలో కొన్ని మార్పులు చేసి అరె ఓ సాంబ కథనే మెగాస్టార్ కోసం గ్యాంగ్ లీడర్‌గా మార్చేశారు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించిది. చిరంజీని మెగాస్టార్ గా నెలబెట్టింది.
Also Read:Mahesh Babu Okkadu Sister: మహేష్ చెల్లెలు ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
[…] Balakrishna- Ravi Teja: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కీలక పాత్రలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడు. ఆ హీరోతో అనిల్ గతంలో ఓ సినిమా చేశాడు. కానీ.. ఆ సినిమా అనిల్ చేయలేదు, అనిల్ తో ఆ హీరో చేయించాడు. ఆ హీరోనే రవితేజ అని మేము గతంలోనే ఈ వార్తను తెలియజేశాము. అయితే.. ఇప్పుడు ఈ వార్త నిజం అని మీడియాలో వైరల్ అవుతుంది. […]
[…] OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. జర్నలిస్టు పై దాడి కేసులో ఇటీవల అంధేరీ కోర్టు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్, అతని బాడీగార్డ్ నవాజ్ షేక్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ అంధేరీ కోర్టు జారీ చేసిన నోటీసులకు సవాల్ చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. జిల్లా కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని, తనకు ఉపశమనం కల్పించాలని ఆయన కోరాడు. […]