Telangana Salaries: జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా జీతాలను విడతల వారీగా వేస్తుంది. అయితే ప్రస్తుతం జీతాలు లేట్‌గా రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాట్లాడితే ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకునే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల జీతాలు లేటుగా ఇచ్చుడేందో అర్థం అయితలేదు. అదేందో గాని సచివాలయం, హైదరాబాద్ లో పనిచేసేవారికి టైంకే జీతాలు పడుతున్నాయి. మరీ జీల్లాల్లో ఉన్న ఉద్యోగులు ఏం పాపం చేసినట్టో…
మనం ఏపీ లెక్కకాదు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకరోజు ముందే జీతాలు అకౌంట్ల పడతయ్ అని చేప్పే సీఎం సారు.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే ప్రభుత్వ ఖజానాల్లో పైసలు లేనట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారిఖున చెల్లించే జీతాలు లేటవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంతో ఉద్యోగులకు కూడా అంతుచిక్కడం లేదు. ప్రజలను ఆకట్టుకునే పథకాలకు మాత్రం కోట్లకు కోట్లు వచ్చిపడతయ్. దళిత బంధు లాంటి పథకాలకు వెచ్చించి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
Also Read: Chiranjeevi Gang Leader: నాగబాబు చేయాల్సిన గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి ఎందుకు చేశాడో తెలుసా..?
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు రాకపోవడంతో బ్యాంక్ లోన్స్, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జీతాలు ప్రతి నెల ఆలస్యం అవుతున్నాయని టాక్. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. అలాగే సచివాలయం, హైదరాబాద్ ప్రాంత వల్లకు ఇచ్చినట్లే తమకు కూడా ఒకటో తారీఖన ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
ఏపీతో పోలిస్తే పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఆదాయం భారీగా పెరుగుతోందని అదే సమయంలో రుణాల చెల్లింపులకూ ఇబ్బందిలేదని అంటున్నారు. అయితే జీతాల చెల్లింపులకు తాత్కాలిక సర్దుబాట్లు ఆలస్యం కావడం, గత ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బిల్లుల చెల్లింపులకు అత్యధికంగా ఖర్చుచేయాల్సి రావడంతో సమస్య వచ్చినట్లుగా భావిస్తున్నారు.