Nagababu Emotional Tweet: మెగా బ్రదర్ నాగబాబు వారి నాన్న గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. వారి నాన్న బతికున్నప్పుడు ఆయనతో కనీసం జన్మదిన శుభాకాంక్షలు చెప్పే వాడిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బతికున్నప్పుడే అన్ని తీర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆత్మీయులు మనతో ఉన్నప్పుడే వారికి కావాల్సిన కోరికలు తీర్చడం చేస్తే వారికి తృప్తిగా ఉంటుందని ఆయన తండ్రిని ఉద్దేశించి చెబుతూ చెమ్మగిల్లారు. తల్లిదండ్రుల కోరికలు తీర్చలేని వారు కొడుకులు కాదని చెప్పడం గమనార్హం. అందుకే మన వారు బతికి ఉన్నప్పుడే వారికి ఇంకా ఏవైనా తీరని కోరికలు ఉన్నాయేమో తెలుసుకుని మరీ తీర్చడం మన కర్తవ్యంగా భావిస్తేనే మంచిదని నాగబాబు నాన్న వర్ధంతి సందర్భంగా కన్నీరు కారుస్తూ చెబుతూ మనసులోని మాట వెలిబుచ్చారు. నాకప్పుడు అంత సెన్స్ లేకపోవడంతోనే నాన్నతో ప్రేమగా మాట్లాడలేకపోయేవాడినని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని జనసేన తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మెగా కుటుంబం కూడా తోడ్పాటు అందిస్తోంది. ఈ మేరకు మెగా బ్రదర్ నాగబాబు జనసేన పీఏసీ సభ్యుడిగా కొనసాగుతూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి గాను చేపట్టాల్సిన వ్యూహాలపై పదును పెడుతున్నారు. వైసీపీని నిలువరించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. దీంతో జనసేన పార్టీ ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది.
Also Read: Ranga Marthanada: ‘రంగమార్తాండ’కు మంచి రోజులొచ్చాయి.. ఇక 10 రోజుల్లో రెడీ
నాగబాబు పవన్ కల్యాణ్ కోసం రాజకీయాల్లో ఉన్నారు. పవన్ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో తన శక్తిమేరకు కష్టపడుతున్నారు. పవన్ కల్యాణ్ ను సీఎం చేయాలనే ఆలోచన అందరిలో వస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. దీంతో వాటిని అంతమొందించే ఉద్దేశంతో జనసేన ముందుకు వెళ్తోంది. జగన్ తన కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతోనే రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చే ఉద్దేశంతో జనసేన తన ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అధికార పార్టీ తీరుతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు.
ఇటీవల కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంతో జరిగిన గొడవలో తీవ్ర నష్టం జరిగినట్లు తెలిసిందే. దీంతోనే జనసేన పార్టీ రాష్ట్రంలో వైసీపీని అడ్డుకుని అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. కార్యకర్తలందరు సమష్టిగా పని చేసి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మెగాబ్రదర్ నాగబాబు జనసేన కోసం నిరంతరం శ్రమిస్తున్నారు పవన్ ను సీఎం చేసే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు.
జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ కూడా జనసేన వైపు చూస్తోంది. కానీ బాబు కోరిక నెరవేరుతుందా? పవన్ కల్యాణ్ బీజేపీతో నడిచేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జనసేన బీజేపీ పొత్తు ఫైనల్ కావడంతో టీడీపీ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ చివరకు పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సమయానికి ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు. మొత్తానికి జనసేన మాత్రం అధికారం చేపట్టాలనే ధృడ నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Also Read:Snake Bite: అద్భుతం: బాలుడిని కాటేసి చనిపోయిన పాము.. అసలేమైంది?