
మాస్ మహారాజ్ రవితేజ వరుస పరాజయాలతో సతమతమవుతూ ‘క్రాక్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను కొట్టాడు. అయితే తాజాగా రవితేజ హీరోయిజంపై నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. మరోసారి నిరూపించావంటూ మెగా బ్రదర్ పోస్ట్ చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకొని వసూళ్ల ప్రవాహం పారిస్తోంది.
Also Read: బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ హీరో !
ఈ నేపథ్యంలో రవితేజ హీరోయిజంపై నాగబాబు చేసిన కామెంట్స్ చేస్తూ.. ”డియర్ మాస్ మహారాజ రవితేజకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘క్రాక్’ మూవీతో నీ ఎనర్జీ అనేది ఆరని మంట అని మరోసారి రుజువు చేశావు. నిన్ను వెండితెరపై చూసిన ప్రతిసారి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నీ తదుపరి మూవీ ‘ఖిలాడీ’ కూడా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్” అని ట్వీట్ చేశాడునాగబాబు.
Also Read:మేకింగ్ వీడియోతో పవర్ స్టార్ అభిమానులకి సర్ప్రైజ్
కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. నేడు రవితేజ పుట్టినరోజు. క్రాక్ సినిమాతో మొదటిసారి యాభై కోట్ల క్లబ్‌లో చేరడంతో రవితేజకు ఈ బర్త్ డే మరింత స్పెషల్‌గా మారింది. అన్నట్టు ‘క్రాక్’ హిట్ జోష్‌లో రవితేజ ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజే రవితేజ బర్త్ డే కానుకగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్