
‘కనులు కనులను దోచాయంటే’ అనే సినిమా మంచి హిట్ అయింది. దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా రూపొందిన ఈ థ్రిల్లర్ మూవీలో కంటెంట్ తో పాటు డైరెక్షన్ కూడా బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ కి ఫ్రెండ్స్ గా నటించారు రక్షణ, నిరంజని అగత్యాన్. కాగా రీతూ వర్మ ఫ్రెండ్ గా నటించిన నిరంజని మొత్తానికి పెళ్లి చేసుకుంటోంది. ఇంతకీ ఎవర్ని అనుకుంటున్నారా.. ఆ సినిమా దర్శకుడినే.
Also Read: నీ ఎనర్జీ ఆరని మంట – నాగబాబు !
‘కనులు కనులను దోచాయంటే’ సినిమా సెట్ లో ఆ సినిమా డైరెక్టర్ మొత్తానికి నిరంజని మనసు దోచుకుని.. ఆమెతో ప్రేమలో పడిపోయాడట. సినిమా రిలీజైన తర్వాత ఇద్దరూ డీప్ గా ప్రేమించుకున్నారని.. ఇప్పుడు ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా దర్శకుడి పేరు దేసింగ్ పెరియస్వామి. కాగా పెరియస్వామి, నిరంజని పెళ్లి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ హీరో !
మరి వీరి పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకీ నిరంజని ఎవరో కాదు… ఒకప్పుడు అజిత్ హీరోగా ‘ప్రేమలేఖ’ వంటి సెన్సేషనల్ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడు అగత్యన్ చిన్న కూతురు ఆమె. అగత్యన్ కి ముగ్గురు కూతుళ్లు కాగా, ఈమె మూడో కూతురు. మొదటి కూతురు దర్శకుడు తిరుని పెళ్లాడగా, రెండో కూతురు ఫిరోజ్ అనే తమిళ్ దర్శకుడిని చేసుకుని సెటిల్ అయింది. ఇప్పుడు మూడో కూతురు కూడా డైరెక్టర్ నే పెళ్లాడబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్