https://oktelugu.com/

బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ హీరో !

నందమూరి బాలకృష్ణకి విలన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించబోతున్నాడా..? నట సింహంకి పోటీగా డైలాగ్ లు చెప్పాలంటే.. అది సునీల్ శెట్టి లాంటి లీడింగ్ లో ఉన్న యాక్టరే కావాలి. అందుకే కష్టం అయినా, సునీల్ శెట్టిని ఫిక్స్ చేశారట. మొదట బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను అడుగుదాం అంటే.. బడ్జెట్ సమస్యలు కాబట్టి, ఆ ఆప్షన్ వెళ్ళలేదట. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య టీంకి దొరికిన గొప్ప ఆప్షన్.. సునీల్ శెట్టి. నిజానికి […]

Written By: , Updated On : January 26, 2021 / 04:54 PM IST
Follow us on

Balakrishna
నందమూరి బాలకృష్ణకి విలన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించబోతున్నాడా..? నట సింహంకి పోటీగా డైలాగ్ లు చెప్పాలంటే.. అది సునీల్ శెట్టి లాంటి లీడింగ్ లో ఉన్న యాక్టరే కావాలి. అందుకే కష్టం అయినా, సునీల్ శెట్టిని ఫిక్స్ చేశారట. మొదట బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను అడుగుదాం అంటే.. బడ్జెట్ సమస్యలు కాబట్టి, ఆ ఆప్షన్ వెళ్ళలేదట. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య టీంకి దొరికిన గొప్ప ఆప్షన్.. సునీల్ శెట్టి. నిజానికి ఈ సినిమాలో డా రాజశేఖర్ ను మొదట విలన్ గా అనుకున్నారు.

Also Read: మేకింగ్ వీడియోతో పవర్ స్టార్ అభిమానులకి సర్ప్రైజ్

కాగా రీసెంట్ గా కరోనా నుండి కోలుకుని మళ్లీ సినిమాల గురించి ఆలోచిస్తోన్న రాజశేఖర్ కి ఇది మంచి ఆప్షనే. కానీ రాజశేఖర్ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పలేదు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఒక యంగ్ హీరో పాత్ర కూడా ఉందని.. అది బాలయ్య అసిస్టెంట్ పాత్ర అని, అయితే అసిస్టెంట్ రోల్ అయినా, ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రోల్ కాస్త కీలకమైనది అని తెలుస్తోంది. అందుకే కొంచెం ఫేమ్ ఉన్న హీరో అయితే బెటర్ అని ఈ రోల్ కోసం మంచి హీరో కోసం వెతుకుతున్నారు.

Also Read: మాస్ మహారాజ్ రవితేజ’ బర్త్ డే స్పెషల్

కాకపోతే ఫామ్ లో ఉన్న యంగ్ హీరో బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పు కుంటారా అంటే అనుమానమే. ఏ హీరోని కదిలించినా సైలెంట్ గా తప్పించుకు తిరుగుతున్నారట. మరి బోయపాటి ఏం చేస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా.. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో అభిమానులను బాగానే ఆకట్టుకున్నాడు

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్