https://oktelugu.com/

బాలయ్య సినిమాలో మూగవాడిగా క్రేజీ హీరో !

నట సింహం బాలయ్య బాబు కొత్త సినిమాలో.. ఒక మూగ – చెమిటి పాత్ర ఉందట. ఇది నలభై నిమషాల కీలక పాత్ర అని.. ఈ పాత్రలో క్రేజీ హీరో నాగశౌర్య నటించబోతున్నాడని తెలుస్తోంది. సహజంగా బాలయ్య సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతుంటారు. బాలయ్య సినిమాల వ్యవహారశైలి అలాగే ఉంటుంది. మరో నటుడికి బాలయ్య సినిమాలో అంత గొప్ప స్కోప్ ఉండదు. కానీ, బాలయ్య కొత్త సినిమాలో మాత్రం ఆ స్కోప్ ఉందట. మొదట ఈ […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 10:04 AM IST
    Follow us on


    నట సింహం బాలయ్య బాబు కొత్త సినిమాలో.. ఒక మూగ – చెమిటి పాత్ర ఉందట. ఇది నలభై నిమషాల కీలక పాత్ర అని.. ఈ పాత్రలో క్రేజీ హీరో నాగశౌర్య నటించబోతున్నాడని తెలుస్తోంది. సహజంగా బాలయ్య సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతుంటారు. బాలయ్య సినిమాల వ్యవహారశైలి అలాగే ఉంటుంది. మరో నటుడికి బాలయ్య సినిమాలో అంత గొప్ప స్కోప్ ఉండదు. కానీ, బాలయ్య కొత్త సినిమాలో మాత్రం ఆ స్కోప్ ఉందట. మొదట ఈ పాత్రకు హీరో శర్వానంద్ ను అనుకున్నారు. కానీ బాలయ్య సలహాతో నాగశౌర్య దగ్గరకు వచ్చింది ఈ పాత్ర.

    Also Read: జబర్ధస్త్ నిర్వాహకులకు షాక్ ఇచ్చిన అవినాష్ !

    ఇక బాలయ్య – బోయపాటి సినిమాలో కూడా ఓ యంగ్ హీరో పాత్ర ఉందని, ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది బాలయ్య అసిస్టెంట్ పాత్ర. కాగా ఈ పాత్రకి.. ముందుగా నవీన్ పొలిశెట్టిని తీసుకుందామనుకున్నా.. ఇంకా బెటర్ అప్షన్ అయితే బాగుంటుందని మేకర్స్ ఇంకా ఆ పాత్ర కోసం మరో యంగ్ హీరోని వెతికే పనిలో ఉన్నారు. జస్ట్ గెస్ట్ రోల్ లాగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ అసిస్టెంట్ రోల్ కాస్త మొదట ఫన్నీగా సాగినా.. చివర్లో ఎమోషనల్ గా ఉంటుందని.. మొత్తం కథకు కీలక పాత్ర అని.. అందుకే ఆ పాత్ర కోసం ఓ దశలో నానిని కూడా అనుకున్నారని సమాచారం, కాకపోతే నాని చేసే అవకాశం లేదు అనుకోండి.

    Also Read: థియేటర్లు కనుమరుగు.. అమెజాన్ గోడౌన్లుగా మార్పు

    నాని చేయకపోయినా ఆ రేంజ్ హీరో చేయాలనేది బోయపాటి ప్లాన్. ఎందుకంటే ఆ పాత్ర చుట్టే సినిమా సాగుతుందట. పైగా సినిమాలో బాలయ్య పాత్ర తాలూకు యాక్టివిటీస్ అన్ని ఆ పాత్ర కోసమే సాగుతాయని.. అందుకే కొంచెం ఫామ్ లో ఉన్న హీరో అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని.. అలాగే సినిమాకి కూడా ప్లస్ జరుగుతుందని మేకర్స్ అభిప్రాయం. మరి ఫామ్ లో ఉన్న ఎవరేజ్ హీరోలు అంటే.. నాని కాకుండా, విజయ్ దేవరకొండ, నిఖిల్, శర్వానంద్ లాంటి హీరోలు ఉన్నా.. వాళ్ళు బాలయ్య సినిమాలో అసిస్టెంట్ పాత్ర చేయడానికి ముందుకు వస్తారా అంటే డౌటే. కాకపోతే, మాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీనుకు ఉన్న బ్రాండ్ కోసమైనా ఎవరో ఒకరు ఒప్పుకుంటారేమో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్