ట్విట్టర్ కిల్లర్.. జపాన్ లో ప్రజలను బయటకు రాకుండా చేసిన ఓ సైకో కిల్లర్. రాత్రి అయ్యిందంటే చాలు యువతను టార్గెట్ చేసి చంపి వారి ముఖాలను గుర్తుపట్టకుండా రక్కేసి వారి శరీర భాగాలను కట్ చేసి కిరాతకంగా చంపేసిన ట్విట్టర్ కిల్లర్ కు ఎట్టకేలకు మరణశిక్ష పడింది. జపాన్ లో ప్రజలను భయభ్రంతులకు గురిచేసిన ‘ట్విట్టర్ కిల్లర్’ టకహిరోకు ఎట్టకేలకు మరణ శిక్ష పడింది.
Also Read: అమెరిక్లనకు నేనే ప్రెసిడెంట్ అంటున్న బైడెన్..!
సంపన్న దేశాల్లో మరణశిక్ష లేదు. కానీ జపాన్ లో ఉంది. గత ఏడాది నలుగురు కుటుంబ సభ్యులను చంపిన చైనీయుడికి జపాన్ లో ఉరిశిక్ష పడింది. ఇప్పుడు ఈ ట్విట్టర్ కిల్లర్ కు పడింది.
జపాన్ దేశంలో టకహిరో అనే 30 ఏళ్ల యువకుడు ట్విట్టర్ ద్వారా పరిచయం చేసుకునో లేదా తనకు పరిచయమైనవారినో టార్గెట్లుగా చేసుకుని వారిని అంతమొందిస్తూ వచ్చాడు. సైకోలా మారాడు. టకహిరో 15 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసుగల వారిని బలిపశువులుగా చేశాడు. ఇతడి అమానుషాలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కోర్టు తీర్పును ఆలకించడానికి బయట పెద్ద ఎత్తున గుమిగూడారు. కోర్టు ఉరిశిక్ష వేయడంతో సంబరాలు చేసుకున్నారు.
Also Read: చంద్రబాబు వద్దు.. జగన్ తోనే బీజేపీ ఫ్రెండ్ షిప్?
ఒక మహిళతోపాటు 9మందిని కిరాతకంగా హతమార్చిన ‘ట్విట్టర్ కిల్లర్’ కు తగిన శిక్ష పడింది. జపాన్ దేశంలో పేరు మోసిన ట్విట్టర్ కిల్లర్ ‘టకహిరో’కు ఎట్టకేలకు టోక్యో కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్ష అతడికి తక్కువేనని అభిప్రాయపడింది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు