https://oktelugu.com/

బిగ్ బాస్ పై ఇంట్రస్ట్, నమ్మకం పోకూడదనే.. వాళ్ళను.. !

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ షో.. మరో నాలుగైదు రోజుల్లో అనగా డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ప్రస్తుతం క్లైమాక్స్ దశలో ఉంది కాబట్టి.. ఈ రియాలిటీ షో నాలుగు నవ్వులతో హాయిగా సాగిపోతూ ఉంది. రెగ్యులర్ డేస్ లో కంటే ఇప్పటి చివరి రోజుల్లోనే ఎక్కువ కిక్ ఉండేలా బిగ్ బాస్ టీమ్ […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 10:13 AM IST
    Follow us on


    బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ షో.. మరో నాలుగైదు రోజుల్లో అనగా డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ప్రస్తుతం క్లైమాక్స్ దశలో ఉంది కాబట్టి.. ఈ రియాలిటీ షో నాలుగు నవ్వులతో హాయిగా సాగిపోతూ ఉంది. రెగ్యులర్ డేస్ లో కంటే ఇప్పటి చివరి రోజుల్లోనే ఎక్కువ కిక్ ఉండేలా బిగ్ బాస్ టీమ్ కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్, ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, దేత్తడి హారిక ఫైనలిస్టులుగా ఉన్నారు.

    Also Read: బాలయ్య సినిమాలో మూగవాడిగా క్రేజీ హీరో !

    కాగా వీరిలో.. మరి గెలిచే ఆ ఒక్కరు ఎవరా అని ప్రముఖులు సైతం ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం ఎలాగూ మొత్తం టాస్కులు ఉండవు కాబట్టి.. కచ్చితంగా ఆడియన్స్ కు బోర్ కొడుతుంది. అందుకే ఎట్టిపరిస్థుతుల్లో ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా బిగ్ బాస్ టీమ్ కొన్ని సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేశారు. వీటిల్లో తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి మొదటి సీజన్ కంటెస్టెంట్ హరి తేజ, రెండో సీజన్ నుంచి గీతా మాధురి, మూడో సీజన్ కంటెస్టెంట్లు శ్రీముఖి, అలీ రేజా ఎంట్రీ ఇచ్చి నిజంగానే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

    అయితే కరోనా నిబంధనల కారణంగా హౌస్‌లోకి వెళ్లని వీళ్లంతా.. మానిటర్ ద్వారా కంటెస్టెంట్లతో ముఖాముఖీ మాట్లాడారు. కాగా వీరు ఒక్కో కంటెస్టెంట్ ఆట తీరు పై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ఎవరికీ వారు కొన్ని సలహాలు సూచనలు చెప్పుకొచ్చారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం.. విన్నర్ విషయంలో ఇప్పటికే అందరూ అభిజీత్ కి ఫిక్స్ అయిపోయారు కాబట్టి, అభిజీత్ నే విన్నర్ ప్రకటిస్తే.. ఇంట్రస్ట్ పోతుంది. అలా అని మరొకర్ని విన్నర్ గా ప్రకటిస్తే.. బిగ్ బాస్ నమ్మకం పోతుంది.

    Also Read: జబర్ధస్త్ నిర్వాహకులకు షాక్ ఇచ్చిన అవినాష్ !

    అందుకే బిగ్ బాస్ పై ఇంట్రస్ట్, నమ్మకం పోకుండా ఉండటానికే పాత కంటెస్టెంట్లను తీసుకువచ్చారు. ఒకవేళ అభిజిత్ ను విన్నర్ గా ప్రకటిస్తే.. ఎందుకు అతను విన్నర్ అని వారి చేత వివరణను ఆసక్తిగా ఇప్పిస్తారట. అదే అభిజీత్ ను కాకుండా మరొకర్ని విన్నర్ గా ప్రకటిస్తే.. ఆ వ్యక్తినే ఎందుకు విన్నర్ గా ప్రకటించారు ? అని అందరూ ఒప్పుకునేలా ఓ వివరణను ఇప్పిస్తారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్