Naga Chaitanya- Samantha: ఎంత మాజీ భార్య అయినా పదేళ్లకు పైగా పరిచయం ఉన్న అమ్మాయి. నాలుగేళ్లు కాపురం చేసిన భార్య. సమంత అంత ఇబ్బందిలో ఉందంటే నాగ చైతన్య ఊరుకుంటాడా? ఆమెను కలవకుండా, ఓదార్చకుండా ఉండగలడా?. నాగ చైతన్య ఇగోలు, పట్టింపులు పక్కన పెట్టి సమంతను కలిశారన్న వార్త గుప్పుమంది. ఆసుపత్రి బెడ్ పై సమంతను చూసి చలించి పోయాడట. గట్టిగా హత్తుకొని వేదన చెందాడట. నీకు ఏమీ కాదని ధైర్యం చెప్పాడట. సమంత, చైతూ మళ్ళీ దగ్గరయ్యారంటూ వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం ఉందా? నిజంగా నాగ చైతన్య సమంతను కలిశాడా? అంటే అంత అబద్దమని తెలిసింది.

ఎందుకంటే అసలు సమంత ఆసుపత్రిలో లేదు. ఆమె ఇంటి వద్దే చికిత్స తీసుకుంటుంది. సమంత తనకు మయోసైటిస్ సోకిందని తెలియజేస్తూ షేర్ చేసిన ఫోటో ఇంట్లో తీసింది. యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతున్న సమంతను ఆ ఫొటోలో మనం చూడవచ్చు. కాబట్టి సమంతను నాగ చైతన్య కలవడం, ఓదార్చడం గాలి వార్తలు మాత్రమే. వారిద్దరికీ తీవ్రమైన ఇగో క్లాష్ నడుస్తుంది. విడిపోయాక కూడా ఒకరిపై మరొకరు రూమర్స్ స్ప్రెడ్ చేసి క్యారెక్టర్ బ్యాడ్ చేసే ప్రయత్నాలు చేశారనే వాదన ఉంది.
సమంత పై వచ్చిన పుకార్లు నాగ చైతన్య పీఆర్ టీమ్ సృష్టించారని, ఇక నాగ చైతన్యపై రూమర్స్ వెనుక సమంత పీఆర్ టీమ్ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాగ చైతన్య తన కోపాన్ని ఏ రూపంలో చూపించలేదు. సమంత మాత్రం పలు సందర్భాల్లో అనేక మార్గాల్లో తన కోపం బయటపెట్టింది. ఒకవేళ సమంత ప్రస్తుత పరిస్థితి నాగ చైతన్యను కలచి వేసినా, ఆమెతో మాట్లాడాలని అనిపించినా తన ఇగో చంపుకొని కలుస్తాడని చెప్పలేం. ఒకవేళ మానవతా కోణంలో కనీసం పలకరిద్దామని ఫోన్ చేసే అవకాశం కలదు.

నాగ చైతన్య ఫోన్ చేస్తే సమంత మాట్లాడతారనే గ్యారంటీ లేదు. కాబట్టి అధికారికంగా సమంతను నాగ చైతన్య కలిసిన సమాచారం లేదా ఫోటోలు బయటకు వచ్చే వరకు ఈ వార్తలను నమ్మడానికి లేదు. ఫోన్ కాల్స్ వంటివి చోటు చేసుకున్నా ఆ సమాచారం బయటకు రాదు. కాబట్టి ఈ మేటర్ వదిలేయడమే బెటర్. కాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద నవంబర్ 11న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో కూడా సమంత పాల్గొనే అవకాశం లేదు. ఇది ఒకింత నిర్మాతలకు దెబ్బే. యశోద ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.