Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి ఊపు ఉందొ మన అందరికి తెలిసిందే..స్పైడర్ తర్వాతి సినిమా నుండి ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది..పర్వాలేదు సినిమా బాగానే ఉంది అనే రేంజ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన సినిమాలు అవలీలగా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కు ని అందుకుంటుంది..ఇలాంటి ట్రాక్ రికార్డు ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి కూడా లేదనే చెప్పాలి.

రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమాకి కూడా నెగటివ్ టాక్ వచ్చినా అవలీలగా వంద కోట్ల రూపాయిల మార్కుని అందుకునేసింది..ఇక ఓవర్సీస్ లో మహేష్ బాబు స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..అందరికి తెలిసిందే..మన టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ ఇచ్చిందే మహేష్ బాబు అని చెప్పాలి..ఆయన హీరో గా నటించిన దూకుడు సినిమానే మన టాలీవుడ్ కి మొట్టమొదటి 1 మిలియన్ సినిమా.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన సినిమాలలో ఒక్క బిజినెస్ మ్యాన్ మినహా ప్రతి సినిమా కూడా 1 మిలియన్ మార్కుని అలవోకగా దాటేశాయి..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, ఆగడు , శ్రీమంతుడు , బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను,మహర్షి, సరిలేరు నీకెవ్వరూ మరియు సర్కారువారి పాట ఇలా వరుసగా పది సినిమాలు 1 మిలియన్ మార్కుని అందుకున్నాయి..వీటిల్లో శ్రీమంతుడు ,భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరూ మరియు సర్కారువారి పాట సినిమాలు 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి చేరాయి..భరత్ అనే నేను సినిమా అయితే ఏకంగా 3.3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

ఇలా మహేష్ బాబు టాలీవుడ్ లో ఎవ్వరికి సాధ్యపడని అనితరసాధ్యమైన రికార్డ్స్ ని సృష్టించి నెంబర్ 1 గా నిలిచాడు..ఆయన తర్వాతి స్థానం లో జూనియర్ ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ నిలిచారు..వీళ్లిద్దరికీ రెండు మిలియన్ల డాలర్లు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి కానీ..మూడు మిలియన్ డాలర్ల సినిమా లేదు..ఎన్టీఆర్ కి #RRR మూవీ ఉంది..కానీ సోలో గా ఒక్క సినిమా కూడా 3 మిలియన్ డాలర్ సినిమా లేదు..కానీ రామ్ చరణ్ కి మాత్రం #RRR తో పాటుగా రంగస్థలం సినిమా కూడా 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.