Hit 2 Teaser: డబుల్ డోస్! అన్నీ డబుల్ డోస్! హిట్ మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహం కావొచ్చు. ఈసారి నాని కథ పై బాగా నమ్మకం పెట్టుకున్నాడు. దానికి తోడు అడవి శేష్ ఉన్నాడు. శైలేశ్ సినిమా మీద బాగా వర్క్ చేసినట్టు ఉన్నాడు. మొత్తానికి ఇవాళ విడుదలైన టీజర్ సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది. విశాఖపట్నం లోని ఓ పోలీస్ స్టేషన్లో అడవి శేష్ ఓ పోలీస్ అధికారిగా పనిచేస్తూ ఉంటాడు. అతనిపై అధికారి రావు రమేష్. రిక్రూట్మెంట్ పెంచండి సార్ అని అడవి శేష్ పలికిన డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. నువ్వు పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లో అంతగా క్రైమ్ రేట్ ఉండదు అని రావు రమేష్ బదులిస్తాడు. అవతలి టీం వీక్ అని మన గోల్ కీపర్ కి రెస్ట్ ఇవ్వడం కదా అని అడవి శేష్ బదులిస్తాడు. తర్వాత అడవి శేష్, మీనాక్షి చౌదరి మధ్య లవ్ ట్రాక్ చూపిస్తారు. అదే సమయంలో కథ ఇక్కడ మొదలవుతుంది అనేదానికి సంకేతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుంది. తర్వాత “యంత్ర నార్యేశు పుజ్యంతే” అని గుర్తు తెలియని వ్యక్తి డైలాగ్ చెబుతుండగా ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపిస్తుంది. ఆమెను ఎవరో బెడ్ పై అత్యంత పాశవికంగా హత్యాచారం చేసినట్టు అక్కడి దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఒళ్లంతా రక్తం ఉండటంతో ఆమె స్నేహితురాలు శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈ కేసును ఎలా అడవి శేష్ చేదించాడు అనే క్వశ్చన్ మార్క్ ని డైరెక్టర్ వదిలాడు. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది.

-పార్ట్ వన్ లో ఏం జరిగిందంటే?
హిట్ పార్ట్ వన్ లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా విక్రమ్ పాత్రలో విశ్వక్సేన్ నటించాడు. ఓ పాత ఇన్సిడెంట్ తో సైకలాజికల్ గా డిస్ట్రబ్ అవుతూ ఉంటాడు. అందరు సలహా మేరకు ఆరు నెలల పాటు సెలవు తీసుకుంటాడు ఈ సమయంలో తన గర్ల ఫ్రెండ్ నేహా మిస్సింగ్ అయినట్టు తెలుస్తుంది. షాక్ కు గురైన విక్రమ్ కు ఆ కేసు ఇవ్వకుండా ఇంకో అమ్మాయి ప్రీతి మిస్సింగ్ కేసు ఇస్తారు. ఈ రెండు కేసులకు లింకు ఉండటంతో ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత తనకు ఎలాంటి నిజాలు తెలిసాయి? నేహా ప్రీతిలను ఎవరు కిడ్నాప్ చేశారు? వాళ్లు బతికారా లేదా అనేది మిగతా కథ. పార్ట్ వన్ లో విశ్వక్సేన్, హరితేజ, రుహాని శర్మ, మురళీ శర్మ, భానుచందర్, బ్రహ్మాజీ వంటి వారు ఉన్నారు.

ఇక సెకండ్ పార్ట్ లో శైలేష్ కొలను అందర్నీ మార్చేశాడు. బహుశా పార్ట్ 1 మంచి హిట్ కావడంతో సెకండ్ పార్ట్ లో మరింత గ్రిప్పింగ్ పెంచేందుకు బాగా కష్టపడ్డట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. పోలీస్ ఆఫీసర్గా అడవి శేష్, అతడి ప్రియురాలిగా మీనాక్షి చౌదరి, శేష్ పై అధికారిగా మురళి శర్మ.. ఇతర పాత్రలను మిగతా నటి నటులు పోషించారు. పార్ట్ వన్ లో శైలేష్ టైట్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి సీరియస్ గా కథలోకి తీసుకెళ్లాడు. అక్కడక్కడ ఆకట్టుకునే సీన్లు రాసుకున్నాడు. సెకండాఫ్ మొదలైనప్పటి నుంచి బాగా నడిపించాడు. కేస్ స్టడీ చేసిన విధానం బాగుంది. కాకపోతే కొన్ని లాజిక్కులు వదిలేయడం, హీరో ఫ్లాష్ బ్యాక్ గురించి సరైన డీటేయిలింగ్ ఇవ్వకపోవడం పెద్ద మైనస్. అది పార్ట్ టూ లో ఇస్తామని సినిమా ఎండింగ్లో చెప్పారు. కానీ పార్ట్ 2 టీజర్ లో అదే కనిపించలేదు. బహుశా ట్రైలర్ లో చెప్తారేమో.. ఓవరాల్ గా గూడచారి, ఎవరు, మేజర్ సినిమా తర్వాత అడవి శేష్ నుంచి వస్తున్న పక్కా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా. డిసెంబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమాపై హీరో నాని, అడవి శేష్, శైలేష్ భారీ ఆశలే పెట్టుకున్నారు.
