మోడీ స్పీచ్ అసదుద్దీన్ కి ఇలా అర్థమైందా?

శుక్రవారం ప్రధాని మోడీ లడక్ లో పర్యటించి చైనా పేరు ప్రస్తావించకుండానే ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోడీ స్పీచ్, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కి మరోలా అర్థమైంది. చైనా పేరును మోడీ ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నింస్తున్నారు. ఆ దేశం పేరును ప్రస్తావించడానికి మోడీ వెనుకాడుతున్నారంటూ నిలదీశారు. ఈ మేరకు ఒవైసీ వరుస ట్వీట్లు చేశారు. ‘ప్రధాని గారూ…మీరు మన సైనికులకు, గాయపడిన జవాన్లకు కలుసుకోవడం మంచిదే. వారితో మాట్లాడటంతో వారి నైతిక […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 3:57 pm
Follow us on

శుక్రవారం ప్రధాని మోడీ లడక్ లో పర్యటించి చైనా పేరు ప్రస్తావించకుండానే ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోడీ స్పీచ్, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కి మరోలా అర్థమైంది. చైనా పేరును మోడీ ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నింస్తున్నారు. ఆ దేశం పేరును ప్రస్తావించడానికి మోడీ వెనుకాడుతున్నారంటూ నిలదీశారు.

ఈ మేరకు ఒవైసీ వరుస ట్వీట్లు చేశారు. ‘ప్రధాని గారూ…మీరు మన సైనికులకు, గాయపడిన జవాన్లకు కలుసుకోవడం మంచిదే. వారితో మాట్లాడటంతో వారి నైతిక స్థైర్యం కూడా తప్పనిసరిగా  పెరుగుతుంది’ అని ఒవైసీ పేర్కొన్నారు. ‘మన దేశంలోకి ఎవరూ ప్రవేశించలేదు…ఎవరూ లేరు’… అంటూ మోదీ ఇటీవల అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన క్లిప్‌ ను కూడా ట్వీట్‌ కు జోడించారు. మోదీ లడక్‌ పర్యటనతో దేశంలోకి శత్రువు చొరబడ్డాడనే విషయం నిరూపితమవుతోందని, చైనా పేరెత్తడానికి మోడీ ఎందుకు వెనుకాడుతున్నారని ఒవైసీ మరో ట్వీట్‌ లో ప్రశ్నించారు. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే మన దగ్గరున్న నిల్వలు 12 రోజులు మత్రమే సరిపోతాయనే విషయం ‘చౌకీదార్‌’కు తెలుసా అని ప్రశ్నించారు.

‘గల్వాన్ కావచ్చు, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ టీఎస్ఓ, డెప్సంగ్‌ లలో పరిస్థితి సీరియస్‌ గా ఉంది. ఆ కారణంగానే త్వరలో పార్లమెంటు సమావేశాలు జరపాలని కోరుతున్నాను. తద్వారా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని విపక్షాలు ప్రస్తావించడం, భారత భూభాగం ఆక్రమణల గురించి ప్రశ్నించడం జరుగుతుంది’ అని మరో ట్వీట్‌ లో ఒవైసీ పేర్కొన్నారు.