Thank You Movie: సినిమా రిలీజ్ పై క్లారిటి ఇచ్చిన “థాంక్యూ” మూవీ టీమ్…

Thank You Movie: ఇటీవల లవ్​స్టోరీ సినిమాతో ప్రేక్షకులను పలకరించి… సూపర్​ హిట్​ అందుకున్నారు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. శేఖర్​ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్​గా నటించింది. ఇందులో నాగచైతన్య నటనకు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా, ప్రస్తుతం “థాంక్యూ” చిత్రంలో నటిస్తున్నారు చైతన్య. ఇప్పటికే దాదాపుగా షూటింగ్​ పూర్తి చేసుకున్న చిత్రబృందం. చివరగా కొన్ని ప్యాచ్​ వర్క్స్​ మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు […]

Written By: Raghava Rao Gara, Updated On : December 8, 2021 4:29 pm
Follow us on

Thank You Movie: ఇటీవల లవ్​స్టోరీ సినిమాతో ప్రేక్షకులను పలకరించి… సూపర్​ హిట్​ అందుకున్నారు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. శేఖర్​ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్​గా నటించింది. ఇందులో నాగచైతన్య నటనకు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా, ప్రస్తుతం “థాంక్యూ” చిత్రంలో నటిస్తున్నారు చైతన్య. ఇప్పటికే దాదాపుగా షూటింగ్​ పూర్తి చేసుకున్న చిత్రబృందం. చివరగా కొన్ని ప్యాచ్​ వర్క్స్​ మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వెలువడకపోవడంతో మూవీని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఓ ప్రముఖ ఓటిటి సంస్థతో డీల్ పూర్తయ్యిందని కూడా అన్నారు.

Thank You Movie

Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ నుంచి “అలియా భట్” మేకింగ్ వీడియో ఔట్…

ఈ మేరకు ఈ సినిమా రిలీజ్ పై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. “థాంక్యూ” సినిమా థియేటర్లోనే విడుదల కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మూవీ యూనిట్. మరోవైపు నాగ చైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “బంగార్రాజు” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 2022 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘మనం’లో కలసి నటించిన తండ్రీ కొడుకు మళ్లీ బంగార్రాజు తో మెప్పించేందుకు రానున్నారు. అలానే నాగ చైతన్య, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ కోసం కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ పై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా చైతూకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: కమల్ హాసన్ “ఇండియన్ 2 ” సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా…