https://oktelugu.com/

Radhe Shyam Movie: రాధే శ్యామ్ నుంచి హిందీలో సోచ్ లియా సాంగ్ రిలీజ్… ఎమోషన్స్ తో ఏడిపించేశారు

Radhe Shyam Movie: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 02:08 PM IST
    Follow us on

    Radhe Shyam Movie: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్.

    Radhe Shyam Movie

    Also Read: రాధేశ్యామ్ నుంచి మరో పాట విడుదల.. మరోసారి మాయ చేసిన సిద్​ శ్రీరామ్​

    రాధేశ్యామ్ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. అయితే, ఈసారి కేవలం హిందీ పాటను మాత్రమే చిత్ర బృందం విడుదల చేశారు. ‘సోచ్ లియా’ అంటూ సాగే ఈ పాటలో.. హీరో ప్రభాస్, పూజా హెగ్డేల ఎమోషన్ సీన్స్ గుండెను పిండేస్తున్నాయి. ఈ పాటను చూస్తుంటే.. పూర్తిగా ప్రేమలో మునిగిన హీరో, హీరోయిన్ల మధ్య బ్రేకప్ అయినట్లు స్పష్టమవుతోంది. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘రాధే శ్యామ్’ సినిమాను విడుదల చేయనున్నారు. ‘రాధే శ్యామ్’ నుంచి ఇప్పటివరకూ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ‘ఈ రాతలే సాంగ్ ను సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, గాయని హరిణి ఆలపించారు. సిద్ శ్రీరామ్ పాడిన మరో పాట ‘నగుమోము తారలే…’ కూడా యూట్యూబ్‌లో బాగా ట్రెండవుతోంది. తెలుగులో ఈ పాట విడుదల గురించి త్వరలోనే అప్డేట్ రానుంది.

    Also Read: స్నేహితులతో కలిసి రాధేశ్యామ్​ సినిమా చూసిన ప్రభాస్​.. ఆ సీన్​ మాత్రం?