https://oktelugu.com/

Indian 2 Movie: కమల్ హాసన్ “ఇండియన్ 2 ” సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా…

Indian 2 Movie: లోకనాయకుడు కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ఇండియన్ 2. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ భారతీయుడు చిత్రానికి ఈ సినిమా సిక్వెల్. అయితే ఈ షూటింగ్ ప్రమాదం జరిగి… వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్… డైరెక్టర్ శంకర్ మధ్య మనస్పర్థలు రావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తమ సినిమాను పూర్తిచేసిన తర్వాత శంకర్ తదుపరి చిత్రాలను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 02:40 PM IST
    Follow us on

    Indian 2 Movie: లోకనాయకుడు కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ఇండియన్ 2. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ భారతీయుడు చిత్రానికి ఈ సినిమా సిక్వెల్. అయితే ఈ షూటింగ్ ప్రమాదం జరిగి… వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్… డైరెక్టర్ శంకర్ మధ్య మనస్పర్థలు రావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తమ సినిమాను పూర్తిచేసిన తర్వాత శంకర్ తదుపరి చిత్రాలను తీయాలంటూ కోర్టును ఆశ్రయించింది లైకా సంస్థ. దీంతో ఇండియన్ 2 రావడం కష్టమే అనుకున్నారంతా. వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదాన్ని తొలగించేందుకు కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు కమల్. ఎట్టకేలకు మేకర్స్… డైరెక్టర్ మధ్య విభేదాలను తగ్గించి ఇండియన్ 2 సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్.

    Indian 2 Movie

    Also Read: బాలయ్య బాబు విగ్గు నా మజాకా? అంత ఖర్చు పెట్టారా?

    ఇక తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఇండియన్ 2 సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.. అయితే ఇందులో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది. కానీ.. ఇప్పుడు కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో తిరిగి ఈ సినిమాలో ఫీమేల్ రోల్ కోసం వెతుకలాట ప్రారంభించింది చిత్రయూనిట్. అయితే తాజాగా ఆ గోల్డెన్ ఛాన్స్ తమన్నాకు దక్కింది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం తమన్నా వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఎఫ్3 సినిమాలో నటిస్తుంది. అలానే మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న భోళా శంక‌ర్ సినిమాలో మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల తమన్నా ‘సీటీమార్‌’, ‘మ్యాస్ట్రో’ చిత్రాల‌తో వచ్చి మెప్పించింది. మరోవైపు డైరెక్టర్ శంక‌ర రాంచ‌ర‌ణ్ 15వ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

    Also Read: ‘అఖండ’ సినిమా పై అందరి మాట అదే !