https://oktelugu.com/

Naga Chaitanya-Sobhitala’s wedding : అక్కడ చాలా సింపుల్ గా నాగ చైతన్య-శోభితల వివాహం, ఎంత మందికి ఆహ్వానం అంటే?

హీరో నాగ చైతన్య పెళ్ళికి భాజాలు మోగాయి. మరో రెండు వారాల్లో శోభిత మెడలో ఆయన తాళి కట్టనున్నారు. పెళ్ళికి ముహూర్తం కూడా కుదిరింది. కాగా నాగ చైతన్య వివాహం చాలా సింపుల్ గా చేస్తున్నారట. ఈ విషయాన్ని నాగార్జున వెల్లడించారు. అందుకు కారణాలు కూడా ఆయన బయటపెట్టారు.

Written By:
  • S Reddy
  • , Updated On : November 22, 2024 / 07:15 PM IST

    Naga Chaitanya-Sobhitala's wedding

    Follow us on

    Naga Chaitanya-Sobhitala’s wedding : నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహంతో టాలీవుడ్ లో సందడి నెలకొంది. రెండేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి అవుతున్నారు. నాగ చైతన్య, శోభిత లవ్ లో ఉన్నట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను ఈ జంట ఖండించారు. వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు బయటకు రావడంతో స్పష్టత వచ్చింది. విదేశాల్లో విహరిస్తూ పలుమార్లు వీరు కెమెరా కంటికి చిక్కారు. మరోవైపు శోభిత ఎఫైర్ రూమర్స్ ని ఖండించడం విశేషం.

    సడన్ గా ఆగస్టు 8న నాగార్జున నివాసంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. వేడుక పూర్తి అయ్యాక సోషల్ మీడియా వేదికగా నాగార్జున విషయం తెలియజేశారు. శోభితను కోడలిగా తమ కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నాగ చైతన్య, శోభితల వివాహం విదేశాల్లో జరుగుతుందనే కథనాలు వెలువడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చ్ నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. లొకేషన్స్ వేటలో ఉన్నారంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి.

    డిసెంబర్ లోనే ముహూర్తం ఫిక్స్ చేశారు. 4వ తేదీ పెళ్లి జరగనుంది. నిశ్చితార్థం మాదిరి పెళ్లి కూడా చాలా సింపుల్ గా ముగిస్తున్నారట. నాగ చైతన్య వివాహం నిరాడంబరంగా చేయాలని కోరాడట. అలాగే పెళ్లి పనులు కూడా తామే చూసుకుంటామని కాబోయే దంపతులు చెప్పారట.అక్కినేని నాగేశ్వరరావుకు ఎంతో ఇష్టమైన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య వివాహం జరగనుందట. కేవలం 300 మందిని ఆహ్వానిస్తున్నారట.

    2024 మాకు చాలా ప్రత్యేకం. నాన్న శతజయంతి వేడుకలు జరిగిన అన్నపూర్ణ స్టూడియోలోనే నాగ చైతన్య వివాహం జరగడం శుభసూచికం. అన్నపూర్ణ స్టూడియో మా కుటుంబ వారసత్వం. నాన్నకు ఇష్టమైన ప్రదేశం. ఇదే ఏడాది శోభిత మా ఇంట్లో కోడలిగా అడుగుపెడుతుంది. వైజాగ్ నుండి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆదర్శ భావాలు ఉన్న అమ్మాయి. శోభిత నటించిన గూఢచారి మూవీ చూసి ఫోన్ చేసి అభినందించినట్లు నాగార్జున తెలియజేశారు.