https://oktelugu.com/

Akkineni Nagarjuna : దేశంలో తొలిసారిగా ‘పుష్ప 2’ తో మేము మొదలు పెట్టబోతున్నాం అంటూ అక్కినేని నాగార్జున సంచలన కామెంట్స్!

రాజమౌళి #RRR చిత్రాన్ని డాల్బీ విజన్ ఫార్మటు లో కూడా చేయించుకున్నాడు. ఇండియా లో ఈ టెక్నాలజీ లేకపోవడంతో, ప్రత్యేకంగా ఆయన జర్మనీ లో పని చేయించుకున్నాడు. 'పుష్ప 2' చిత్రాన్ని కూడా డాల్బీ విజన్ ఫార్మటు లో కూడా విడుదల చేయాలని అనుకున్నాడట డైరెక్టర్ సుకుమార్.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 07:39 PM IST

    Akkineni Nagarjuna

    Follow us on

    Akkineni Nagarjuna : దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ట్రేడ్ కూడా మన ఇండియన్ సినిమా మార్కెట్ ఈ సినిమాతో మరో లెవెల్ కి వెళ్తుందని బలంగా నమ్ముతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా వెయ్యి కోట్ల రూపాయలకు జరిగిందంటే, కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 2000 కోట్ల రూపాయిల టార్గెట్ ఉండబోతుంది అన్నమాట. అందుకే మేకర్స్ కూడా ఈ సినిమా క్వాలిటీ పట్ల, ఔట్పుట్ పట్ల ఎక్కడా కూడా తగ్గడం లేదు. ప్రతీ షాట్ అద్భుతంగా వచ్చేలా డైరెక్టర్ సుకుమార్ అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే తనతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్న దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళను కూడా ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే బాధ్యత నుండి తప్పించి తమన్ చేతిలో పెట్టారు. కేవలం 2D లో మాత్రమే కాకుండా, 3D, ఐమాక్స్, 4Dx ఫార్మటులో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది.

    ఇదంతా పక్కన పెడితే రాజమౌళి #RRR చిత్రాన్ని డాల్బీ విజన్ ఫార్మటు లో కూడా చేయించుకున్నాడు. ఇండియా లో ఈ టెక్నాలజీ లేకపోవడంతో, ప్రత్యేకంగా ఆయన జర్మనీ లో పని చేయించుకున్నాడు. ‘పుష్ప 2’ చిత్రాన్ని కూడా డాల్బీ విజన్ ఫార్మటు లో కూడా విడుదల చేయాలని అనుకున్నాడట డైరెక్టర్ సుకుమార్. మన ఇండియా లో ఇలాంటి స్క్రీన్స్ ఇంకా రాలేదు కానీ, ఓవర్సీస్ లో మాత్రం వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ స్క్రీన్స్ నుండి వచ్చే వసూళ్లు మామూలు రేంజ్ లో ఉండవు. అందుకే మన టాలీవుడ్ స్థాయిని పెంచే సత్తా ఉన్న పాన్ ఇండియన్ సినిమాలను డాల్బీ విజన్ ఫార్మటు లో విడుదల చేస్తున్నారు ఈమధ్య మన ఇండియన్ మూవీ మేకర్స్. అయితే ‘పుష్ప 2’ ని ఇప్పుడు డాల్బీ విజన్ ఫార్మటు లో మార్చేంత సమయం లేకపోవడంతో ఆ ఆలోచనని నెల రోజుల క్రితమే విరమించుకున్నాడట డైరెక్టర్ సుకుమార్.

    కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న అక్కినేని నాగార్జున, త్వరలోనే మన అన్నపూర్ణ స్టూడియోస్ లో డాల్బీ విజన్ టెక్నాలజీ ని ప్రవేశ పెట్టబోతున్నాం. మొదటి సినిమాగా మీ ‘పుష్ప 2’ చిత్రాన్ని మా స్టూడియోస్ లో చేయించుకోండి అని అన్నాడట నాగార్జున. దీనికి మేకర్స్ ఎంతో సంతోషించారట. నిన్ననే ఫస్ట్ హాఫ్ కంటెంట్ మొత్తాన్ని పంపారట. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘మన దేశం లో ఏ స్టూడియో లో కూడా డాల్బీ విజన్ టెక్నాలజీ ని ఉపయోగించడం లేదు. ఎందుకంటే మన ఇండియా లో ఆ స్క్రీన్స్ లేవు. కానీ ఓవర్సీస్ లో వేల సంఖ్యలో స్క్రీన్స్ ఉన్నాయి. #RRR చిత్రాన్ని రాజమౌళి గారు జర్మనీ లో డాల్బీ విజన్ పనులు చేయించుకొని విడుదల చేసారు. ఆ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు ఈ డాల్బీ విజన్ ద్వారా అదనంగా వచ్చాయి. ఇక నుండి మన మేకర్స్ వేరే దేశాలకు ఈ టెక్నాలజీ కోసం వెళ్ళక్కర్లేదు. పుష్ప 2 తో మేము ప్రారంభించబోతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.