Naga Chaitanya and Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.మూడు తరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా నాగేశ్వరరావు(Nageshwara rao), నాగార్జున(Nagarjuna) తర్వాత ఆ రేంజ్ లో అక్కినేని ఫ్యామిలీ అనేది ముందుకు సాగలేక పోతుంది. కారణం ఏదైనా కూడా ఇప్పుడు అక్కినేని హీరోలు వరుసగా సక్సెస్ లను సాధించడంలో ఫెయిల్ అయిపోతున్నారు. తద్వారా అక్కినేని ఫ్యామిలీ అంతకంతకు వెనక్కి పడిపోతుంది. ఇక ఇదిలా ఉంటే నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య (Naga Chaithanya) సైతం ‘ఏ మాయ చేసావే’ (Em Maya Chesave) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన సమంత(Samantha) ను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకే వాళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా నాగచైతన్య శోభిత ధూళిపాల (Shobhitha Dhulipalla) అనే మరొక హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు. దీంతో సమంత అభిమానులు సైతం నాగచైతన్య మీద చాలావరకు ఫైల్ అయ్యారు.
సమంత తన బతుకు తాను బతుకుతుంటే ప్రేమ, పెళ్లి అంటూ ఆమెను పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చి మొత్తానికి తన లైఫ్ ను డిస్టర్బ్ చేసారు అంటూ సమంత అభిమానులు నాగచైతన్య మీద విమర్శలు అయితే చేస్తున్నారు.ఇక ఏ మాయ చేసావే సినిమా దర్శకుడు అయిన ‘గౌతమ్ మీనన్’ (Goutham menan)సైతం ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
అదేమిటి అంటే ముందుగా తను మహేష్ బాబు(Mahesh Babu) ను ఊహించుకొని ఏం మాయ చేశావే సినిమా స్టోరీని రాసుకున్నానని ఆ కథను మహేష్ బాబుకి వినిపించినప్పటికి ఆయన కూడా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారని చెప్పాడు. కాకపోతే అప్పుడు మహేహు బాబుకి ఉన్న తన ఇమేజ్ కు సరిపడా కథ అది కాదని ఆయన చెప్పడంతో ఆ సినిమాని నాగచైతన్య తో చేశానని గౌతమ్ మీనన్ చెప్పాడు… ఇది తెలుసుకున్న సమంత అభిమానులు సైతం మహేష్ బాబు ఏ మాయ చేసావే సినిమా చేసి ఉంటే బాగుండేది.
అలా అయితే సమంతకి నాగచైతన్య పరిచయం అయ్యేవాడు కాదు. తద్వారా వీళ్ళ మధ్య ప్రేమ అనేది చిగురించేది కాదు ఇక పెళ్లి దాకా వెళ్లే పరిస్థితి కూడా ఎదురయ్యేదు కాదు. కేవలం మహేష్ బాబు వల్లే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అంటూ సోషల్ మీడియా లో కొన్ని కామెంట్లైతే చ్చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ గా మారుతుండటం విశేషం…