Naga Chaitanya and Samantha: సమంత నాగచైతన్య విడిపోవడం పై సోషల్ మీడియాలో మరియు రెగ్యులర్ మీడియాలో జరుగుతున్న చర్చ కాస్త అదుపు తప్పుతున్నట్టు కనిపిస్తుంది. సమంత వంద కోట్లు భరణం అడిగిందని, చైతులో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టే.. సమంత దూరం అయిందని ఇలా చాలా రకాల పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఓ హాలీవుడ్ సినిమాలో ఓ సీన్ ఉంది. ఓ హీరోయిన్ ప్రేమించి వివాహం చేసుకుంటుంది. కానీ ఒక రోజు అనూహ్యంగా తన దగ్గర స్నేహితుడికి ఫోన్ చేసి.. నాకు మా ఆయనతో చాలా సమస్యగా ఉంది. ఆయన బయట ప్రపంచానికి చాలా మంచి వాడు, కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి తన విశ్వరూపం చూపిస్తాడు, అందరితో మంచిగా ఉండి నాతో మాత్రమే అలా ఎందుకు ఉంటాడో నాకర్ధం కాదు’ అంటూ చెప్పుకుంటూ పోతుంది.

ఈ సన్నివేశాన్ని కరెక్ట్ గా అర్ధం చేసుకుంటే.. ఒక జంట మధ్యన బయట ప్రపంచానికి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. చాలా జంటలు ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. పైకి అంత బాగుందనిపిస్తుంది, కానీ లోపల తెలియని చాలా సమస్యలు. దీనికి రెండు కారణాలు.. జీవిత భాగస్వాములను సరిగ్గా అర్థం చేసుకోకుండా జీవితాన్ని మొదలు పెట్టడం, రెండవది, ప్రతి 5 సంవత్సరాలకు ఒక మనిషి తన అనుభవాల వల్ల మారతాడు. ఆ వచ్చిన మార్పుల వలన.. మారుతున్న మనిషి ఒక్కోసారి భర్తకు కానీ, భార్యకు కానీ నచ్చకపోవచ్చు.
ఒకరి కోసం ఒకరు మారితే ఏ సమస్య ఉండదు, కానీ వారి కోసమే వారు మారడం వలన అసలు సమస్య మొదలవుతుంది. ఏది ఏమైనా విడాకులు తీసుకునే ముందు ఒక సెలబ్రిటీ జంట లోతుగా ఆలోచించి కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోదు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారి జీవితాలు మీద అనవసరమైన కామెంట్స్ చేయడం తగదు.