https://oktelugu.com/

Naga Chaitanya: నాన్న ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను స్టార్ హీరో అయ్యిపోగలను.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్

ఇప్పటికీ ఆయన వరుసగా సినిమాలు చేస్తూ నేటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.తన కెరీర్ విషయం లో అంత ప్లానింగ్ తో పోతూ ఇంత దూరం ప్రయాణించిన నాగార్జున, తన కొడుకుల జీవితాలను మాత్రం పట్టించుకోవడం లేదని అభిమానుల్లోనూ మరియు ఇండస్ట్రీ లోనూ ఎప్పటినుండో సాగుతున్న చర్చ.

Written By:
  • Vicky
  • , Updated On : May 6, 2023 / 02:46 PM IST

    Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీ ని శాసించే రేంజ్ లో ఉన్న రెండు మూడు కుటుంబాలలో ఒకటి అక్కినేని కుటుంబం.స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మూలస్తంభం లాంటి వాడు, ఆయన తర్వాత కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ , ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి, టాప్ 3 హీరోలలో ఒకడిగా నిలిచాడు.

    ఇప్పటికీ ఆయన వరుసగా సినిమాలు చేస్తూ నేటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.తన కెరీర్ విషయం లో అంత ప్లానింగ్ తో పోతూ ఇంత దూరం ప్రయాణించిన నాగార్జున, తన కొడుకుల జీవితాలను మాత్రం పట్టించుకోవడం లేదని అభిమానుల్లోనూ మరియు ఇండస్ట్రీ లోనూ ఎప్పటినుండో సాగుతున్న చర్చ.అయితే ఇదే విషయం పై నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

    ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ ఈ నెల 12 వ తారీఖున విడుదలకి సిద్ధంగా ఉంది,ఈ సందర్బంగా ఆయన వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విలేఖరి ‘మీ నాన్న గారు అఖిల్ కి మరియు మీకు సరైన డైరెక్టర్స్ సెట్ చెయ్యడం లేదని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఒక రూమర్ ఉంది, దీనిపై మీరు ఏమంటారు’ అని అడగగా, నాగ చైతన్య దానికి సమాధానం ఇస్తూ ‘నాన్న ఇప్పటికి ఇప్పుడు తల్చుకుంటే, ఇండస్ట్రీ లో ఎలాంటి డైరెక్టర్ తో అయినా మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి సెట్ చెయ్యగలడు.కానీ మాకు అది ఇష్టం లేదు, మేము మా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకున్నాము,నాన్న గారు కూడా మమల్ని ఎన్నో సార్లు అడిగారు, కానీ మేము ఒప్పుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.