‘లవ్ స్టోరీ’కి బిజినెస్ భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో సినిమా రిలీజ్ కి ముందు నిర్మాతలు టెన్షన్ పడ్డారు. కలెక్షన్స్ వస్తాయా ? రావా ? అంటూ బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ లవ్ స్టోరి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది

మొత్తానికి ‘లవ్ స్టోరీ’ మూవీకి రెండు రోజులకు కలిపి ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ. 5.62 కోట్లు,
సీడెడ్‌లో రూ. 1.89 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ. 1.41 కోట్లు,
ఈస్ట్ గోదావరిలో రూ. 76 లక్షలు,
వెస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు,
గుంటూరులో రూ. 83 లక్షలు,
కృష్ణాలో రూ. 57 లక్షలు,
నెల్లూరులో రూ. 39 లక్షలతో..
మొత్తం రూ. 12.21 కోట్లు షేర్, రూ. 19.13 కోట్లు గ్రాస్ వచ్చింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్ వివరాలకు వస్తే..
తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 12.21 కోట్లు వసూలు చేసింది.
కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 74 లక్షలు,
ఓవర్సీస్‌లో రూ. 3.35 కోట్లు రాబట్టింది.
ఇక ఇప్పటివరకూ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా లవ్ స్టోరి సినిమాకు రూ. 16.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 26 కోట్లు గ్రాస్ వచ్చింది.
మరి లవ్ స్టోరి బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటాలి అంటే.. ఇంకెంత కలెక్ట్ చేయాలి ?
ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు మేర బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటాలి అంటే రూ. 32 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. మొదటి రెండు రోజులకు రూ. 16.30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మరో 15.70 కోట్లు కలెక్ట్ చేస్తే.. ఈ సినిమా లాభాల్లోకి వెళిపోయినట్టే. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఈ సినిమాకి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. చైతు కెరీర్ లోనే రికార్డు కలెక్షన్స్ నమోదు చేయనుంది.