https://oktelugu.com/

Naga Chaitanya: నాకు ఇద్దరు పిల్లలు కావాలి, ఓపెన్ అయిన నాగ చైతన్య, వాళ్ళను ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసా?

వివాహానికి ముందు నాగ చైతన్య ఈ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యక్తిగత విషయాలపై స్పందించారు. నాగ చైతన్య తనకు ఇద్దరు పిల్లలు కావాలని ఓపెన్ అయ్యాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : December 7, 2024 / 05:09 PM IST

    Naga Chaitanya(6)

    Follow us on

    Naga Chaitanya: నాగ చైతన్య చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. కేవలం తన సినిమా ప్రమోషన్స్ కి మాత్రమే ఆయన పబ్లిక్ లో కనిపిస్తారు. అలాగే సోషల్ మీడియాను వాడరు. కేవలం అత్యంత ముఖ్యమైన విషయాలపై మాత్రమే స్పందిస్తారు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో ఒక టాక్ షో స్ట్రీమ్ అవుతుంది. వివాహానికి ముందు నాగ చైతన్య ఈ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యక్తిగత విషయాలపై స్పందించారు. నాగ చైతన్య తనకు ఇద్దరు పిల్లలు కావాలని ఓపెన్ అయ్యాడు.

    నాగ చైతన్య మాట్లాడుతూ.. నాకు 50 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలతో ఆడుకోవాలనేది నా ఆశ అన్నారు. మధ్యలో కలగజేసుకున్న రానా… వెంకీ మామలా ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలని అనుకుంటున్నావా? అని అడిగాడు. లేదు ఇద్దరు పిల్లలు చాలు. అబ్బాయి అయితే రేస్ ట్రాక్ కి పంపుతాను. అమ్మాయి అయితే తనకు నచ్చిన ప్రొఫెషనల్ లో ఎంకరేజ్ చేస్తాను. మనం బాల్యంలో అందమైన క్షణాలు గడిపాము. నా పిల్లలతో అలాంటి క్షణాలు మరలా ఆస్వాదించాలి అనుకుంటున్నాను, అన్నారు.

    జీవితంలో సంతోషంగా ఉండటమే అసలైన సక్సెస్. ఒక సినిమా చేస్తాము. బాగా ఆడుతుంది. మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. చాలా రోజులు ఆడుతుంది. నా దృష్టిలో అది నిజమైన సక్సెస్ కాదు. కొన్నిసార్లు మనం స్వయంగా స్క్రిప్ట్ ఎంచుకుంటాం? ఆ మూవీ విజయం సాధిస్తే, అది నిజమైన సక్సెస్. కుటుంబమే నా లైఫ్. అది లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను, అన్నారు.

    నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేశారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా నాగ చైతన్య-శోభిత వివాహం జరిగింది. గత రెండేళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. శోభిత మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించారు. హాలీవుడ్ చిత్రాలు సైతం చేశారు. శోభిత ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు అమ్మాయి.

    కాగా నాగ చైతన్య, సమంత మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం శోభిత ప్రేమలో పడిన నాగ చైతన్య ఆమెను జీవిత భాగస్వామిగా తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. చందు మొండేటి దర్శకుడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు