https://oktelugu.com/

Srilila : ఇక జీవితంలో మళ్ళీ అలాంటి పొరపాటు చేయను..ఇదే చివరిసారి అంటూ శ్రీలీల ఎమోషనల్ కామెంట్స్!

ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి రావడమంటే అందం, టాలెంట్ తో పాటుగా బోలెడంత అదృష్టం కూడా ఉండాలి.

Written By:
  • Vicky
  • , Updated On : December 7, 2024 / 05:14 PM IST

    Srilila

    Follow us on

    Srilila : ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి రావడమంటే అందం, టాలెంట్ తో పాటుగా బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. ఈ మూడు ఒకే అమ్మాయిలో ఉండడం చాలా అరుదు, ఒకటి ఉంటే మరొకటి ఉండదు. కానీ ఆ మూడు ఉన్న అరుదైన అమ్మాయి శ్రీలీల. తెలుగింటికి చెందిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి, శ్రీకాంత్ కొడుకు రోషన్ మొదటి సినిమా ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. అంతకు ముందు ఈమె కన్నడలో పలు సినిమాల్లో నటించింది కానీ, అవి ఆమెకు అనుకున్న స్థాయి గుర్తింపుని మాత్రం తీసుకొని రాలేకపోయాయి. ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది మాత్రం మన తెలుగు ఆడియన్స్ మాత్రమే. పెళ్లి సందడి చిత్రం తర్వాత ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కట్టాయి. ముఖ్యంగా రవితేజ తో కలిసి ఈమె నటించిన ‘ధమాకా’ చిత్రం ఈమె కెరీర్ లో ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు.

    ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ చూసి ఈలలు వెయ్యని తెలుగోడు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ఆమె డ్యాన్స్ చూసేందుకు కోసం ఆడియన్స్ థియేటర్స్ కి రెండు మూడు సార్లు వెళ్లారు. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. చూస్తూ ఉండగానే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అయితే అనేక సందర్భాల్లో ఈమెకు ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశం వచ్చింది. రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఇస్తామని ఆఫర్ చేసారు. కానీ ఈమె మాత్రం ఒప్పుకోలేదు. ఐటెం సాంగ్స్ మీద ఆసక్తి లేదు, ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా చేయనని చెప్పుకొచ్చింది. కానీ రీసెంట్ గా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ‘పుష్ప 2’ లో ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ చేసింది.

    ఈ ఐటెం సాంగ్ చేయడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ లాంటి డ్యాన్సర్ ఉండడం, ఆ సినిమాకి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండడం వల్లే అని చెప్పుకొచ్చింది శ్రీలీల. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక యాంకర్ ఈమెని ప్రశ్న అడుగుతూ ‘పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేసారు. అంటే ఇక మీదట మీరు ఐటెం సాంగ్స్ వరుసగా చేస్తారా?’ అని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘పుష్ప 2 చిత్రమే నేను మొదట చేసిన ఐటెం సాంగ్..ఇదే నా చివరి ఐటెం సాంగ్ కూడా. మళ్ళీ పొరపాటున ఐటెం సాంగ్స్ జోలికి పోనూ’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. దీనిపై ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వస్తుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేస్తున్న ఈ రోజుల్లో శ్రీలీల ఐటెం సాంగ్స్ చేయడంలో తప్పేమి ఉంది?, అదేదో నేరం అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతుంది అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.