CISF Constable Recruitment 2025 : ఉన్నత చదువులు చదివి లక్షల మంది ఉద్యోగాల వేటలో ఉన్నారు. నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) నుంచి కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 1124 పోస్టులు ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు 2025, మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టలు సంఖ్య : 1124
కానిస్టేబుల్ / డ్రైవర్ : 845
కానిస్టేబుల్ / డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ : 279
అర్హతలు :
ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. భారీ మోటార్ వాహనం లేదా లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 167 సెం.మీ. ఎత్తు, ఛాతీ 80–85 సెం.మీ ఉండాలి.
వయస్సు..
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు మార్చి 4వ తేదీ వరకు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అన్ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక ప్రక్రియ..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఓఎంఆర్ లేదా సీబీటీ విధానంలో ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. పీఈటీ/పీఎస్టీ, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ సమయంలో ఒరిజినల్స్‌తోపాటు అవసరమైన సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు.
వేతనం ఇలా..
సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం అందిస్తారు.
దరఖాస్తు విధానం :
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సీఐఎస్‌ఎఫ్ అధికారిక వెబ్ సైట్ లో వెళ్లి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 03 – 02– 2025
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 04 – 03 – 2025