https://oktelugu.com/

Naga Chaitanya: 4000 రూపాయిల పెట్టుబడితో 50 కోట్ల రూపాయిలు సంపాదించిన నాగ చైతన్య..జాక్పాట్ అంటే ఇదే!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో గా కొనసాగుతున్న ఆయన, హైదరాబాద్ లో ఒక రెస్టారంట్ ని స్థాపించి సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అని కూడా అనిపించుకున్నాడు. కేవలం రెస్టారంట్ మాత్రమే కాదు, ఆయనకు వివిధ రాష్ట్రాల్లో అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 / 03:30 PM IST

    Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya: అక్కినేని కుటుంబం లో నాగార్జున తర్వాత మంచి సక్సెస్ ఫుల్ హీరో గా ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్న నటుడు అక్కినేని నాగచైతన్య. ‘జోష్’ చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమైన నాగ చైతన్య తన విలక్షణమైన స్క్రిప్ట్ సెలక్షన్ తో ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు లవ్ స్టోరీ సినిమాలు అంటే మన బుర్రలోకి కొంత మంది హీరోల పేర్లు గుర్తుకొచ్చేవి. అలా ప్రస్తుత జనరేషన్ లో లవ్ స్టోరీస్ అంటే మనకి గుర్తుకు వచ్చే ఏకైక హీరో నాగ చైతన్య మాత్రమే. ఏ మాయ చేసావే, 100% లవ్, ఒక లైలా కోసం, ప్రేమమ్, మజిలీ, మనం, లవ్ స్టోరీ ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఆల్ టైం క్లాసిక్ చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాడు.

    అలా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో గా కొనసాగుతున్న ఆయన, హైదరాబాద్ లో ఒక రెస్టారంట్ ని స్థాపించి సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అని కూడా అనిపించుకున్నాడు. కేవలం రెస్టారంట్ మాత్రమే కాదు, ఆయనకు వివిధ రాష్ట్రాల్లో అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఆయన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ సంచలనం గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘2013 వ సంవత్సరం లో నేను కేవలం 5 డాలర్లకు ఒక బిట్ కాయిన్ ని కొనుగోలు చేశాను. ఇప్పుడు ఆ బిట్ కాయిన్ ధర 6 మిలియన్ డాలర్స్ కి చేరింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 50 కోట్ల రూపాయలకు పైమాటే. ఇప్పుడు నేను దీనిని అమ్మేయాలని అనుకుంటున్నాను, దీనికి మీరేమంటారు?’ అని ట్వీట్ వేసాడు.

    దీంతో ఆ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. నాగ చైతన్య లాంటి హీరో చీప్ గా ట్విట్టర్ లో ఇలాంటి ట్వీట్స్ వేయడం ఏమిటి?, ఆయన వ్యాపార రంగం లో ఉన్నాడు కాబట్టి ఇలాంటివి సర్వసాధరణం అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ పబ్లిక్ గా ఇలాంటి ట్వీట్ సెలబ్రిటీ హోదా లో వేయడం కరెక్ట్ కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఆ ట్వీట్ నాగ చైతన్య వేసింది కాదని ఆ తర్వాత తెలిసింది. ఆయన అకౌంట్ హ్యాక్ అయ్యిందట. ఇటీవల కాలం లో ప్రముఖ సెలెబ్రిటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. నయనతార, శింబు అకౌంట్స్ కూడా ఇలాగే హ్యాక్ అయ్యి, ఆ అకౌంట్స్ నుండి బిట్ కాయిన్స్ కి సంబంధించిన ట్వీట్లు పడ్డాయి. అసలు సెలెబ్రిటీలను ఫోకస్ చేస్తూ ఇలా ఎవరు హ్యాకింగ్ చేస్తున్నారు?, వాళ్ళ లక్ష్యం ఏమిటి అనేది తెలియట్లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి హ్యాకింగ్స్ జరగకుండా ఉండే పరిస్థితులు కనిపించడం లేదు, దీనిని కంట్రోల్ చేయడం అంత సాధారణమైన విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు.